(1 / 5)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పెద్ద కుమారుడు ఆదిత్య అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆయన డిగ్రీ పొందిన కార్యక్రమానికి కవిత ఇతర కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.
(2 / 5)
తన కుమారుడు ఆదిత్య డిగ్రీ తీసుకున్న ఫొటోలను ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియాలో పంచుకున్నారు.
(3 / 5)
'నీ చిన్న చేయి పట్టుకోవడం నుంచి నువ్వు డిగ్రీ పట్టుకోవడం చూడటం వరకు, ఎంత అద్భుతమైన ప్రయాణం అది, ఆదిత్య. నువ్వు చాలా కష్టపడి పనిచేశావు, చాలా ఎదిగావు, మనమందరం గర్వపడేలా చేశావు. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను, అభినందనలు' అని కవిత సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.
(4 / 5)
ఆదిత్య గ్రాడ్యుయేషన్ వేడుక నుంచి కొన్ని విలువైన క్షణాలు, నిజంగా ఆనందంగా ఉందని కవిత ఫొటోలు పంచుకున్నారు.
(5 / 5)
భర్త, కుమారులతో ఎమ్మెల్సీ కవిత
ఇతర గ్యాలరీలు