Movies Without Songs: సాంగ్స్ లేకుండా రిలీజైన మూవీస్ ఇవే - ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
పాటలు లేకుండా సినిమాను ఊహించడం కష్టమే. పాటలతోనే బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన సినిమాలు చాలానే కనిపిస్తాయి. సాంగ్స్ వల్లే ఏళ్లు గడిచినా ప్రేక్షకులకు గుర్తుండిపోయిన సినిమాలు ఉన్నాయి. అయితే పాటలే లేకుండా కొన్ని సినిమాలొచ్చాయి. వాటిని ఏ ఓటీటీలో చూడాలంటే?
(1 / 5)
విక్రమ్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన తొమ్మిది నెలలు మూవీని పాటలు లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు క్రాంతి కుమార్. సరోగసీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ మూవీని తమిళంలోకి రీమేక్ అయ్యింది. తెలుగులో పాటలు లేకుండా రిలీజైన ఈ మూవీ తమిళంతో మాత్రం ఆరు పాటలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. యూట్యూబ్‌లో తొమ్మిది నెలలు సినిమాను చూడొచ్చు.
(2 / 5)
కార్తి ఖైదీ తమిళంతో పాటు తెలుగులో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఒక్క పాట కూడా కనిపించదు. ఖైదీ మూవీని తెలుగులో ఆహా ఓటీటీలో చూడొచ్చు.
(3 / 5)
శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన కన్నడ మూవీ ది ఘోస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. గత ఏడాది రిలీజైన ఈ యాక్షన్ మూవీని పాటలు లేకుండా రూపొందించారు. ఈ మూవీ తెలుగులో జీ5 ఓటీటీలో అందుబాటులో ఉంది.
(4 / 5)
సమంత యూటర్న్ మూవీ కూడా పాటలు లేకుండా తెలుగు ప్రేక్షకలు ముందుకొచ్చింది. ఒకే ఒక థీమ్‌సాంగ్‌ను మాత్రం ప్రమోషన్స్ కోసం రిలీజ్ చేశారు. ఆ పాట కూడా సినిమాలో కనిపించదు. అమెజాన్ ప్రైమ్‌లో యూటర్న్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇతర గ్యాలరీలు