ఖతర్నాక్ లుక్‌లో 'కరీంనగర్ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి-karimnagar railway station redeveloped works completed under amrit station scheme latest photos here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఖతర్నాక్ లుక్‌లో 'కరీంనగర్ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి

ఖతర్నాక్ లుక్‌లో 'కరీంనగర్ రైల్వే స్టేషన్' - ఈ కొత్త ఫొటోలు చూడండి

Published May 21, 2025 09:53 AM IST Maheshwaram Mahendra Chary
Published May 21, 2025 09:53 AM IST

రైల్వే ప్రయాణికులకు సరికొత్త అనుభూతితో పాటు మంచి సౌకర్యాలను అందించాలనే లక్ష్యంతో భారత రైల్వే ఆధునీకరణ పనులను చేపట్టింది. ఇందుకోసం “ అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా తెలంగాణలోని కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆధునీకరించారు. పూర్తి వివరాలతో పాటు తాజా ఫొటోలను ఇక్కడ చూడండి....

అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్” లో భాగంగా రైల్వే శాఖ పలు రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోంది.  ఇందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. అదిరిపోయే స్థాయిలో ఆధునీకరించారు. ఇందుకు సంబంధించిన వివరాలను రైల్వే అధికారులు వెల్లడించారు.

(1 / 8)

అమృత్ భారత్ రైల్వే స్కీమ్ లో  భాగంగా  కరీంనగర్ రైల్వే స్టేషన్ రూపురేఖలను మార్చేలా రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ఈ పన్నులన్నీ పూర్తయ్యాయి. దీంతో మే 22వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు.

(2 / 8)

అమృత్ భారత్ రైల్వే స్టేషన్ స్కీమ్ లో భాగంగా... కరీంనగర్  రైల్వే స్టేషన్ను పూర్తిగా అప్ గ్రేడ్ చేశారు. ఆధునాత ఎస్కలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాల్స్, పరిశుభ్రమైన ప్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫారమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మోడ్రన్ టాయిలెట్లు నిర్మించారు.

(3 / 8)

కరీంనగర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ కోసం రైల్వే శాఖ రూ. 25.85 కోట్లు కేటాయించింది. మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా... రెండేళ్లలోపు  పునరాభివృద్ధి పనులను పూర్తి చేశారు. గడువులోపు పూర్తి కావటంతో... ఈనెల 22వ తేదీన ఉదయం 9.30 గంటలకు జాతికి అంకితం చేస్తారు.

(4 / 8)

ప్రయాణికుల సౌకర్యం కోసం కొత్త టికెట్ కౌంటర్లు, లాకర్ రూమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, డ్రింకింగ్ వాటర్, ఏటీఎంలు, డిజిటల్ డిస్ ప్లేలు, సీసీ కెమెరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు.

(5 / 8)

స్టేషన్ బయట, లోపల ప్రయాణికుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కల్పించారు.  వాహనదారులకు విశాలమైన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్కు వెళ్లే రోడ్డును డివైడర్తో కూడిన డబుల్ రోడ్డుగా డెవలప్ చేశారు.

(6 / 8)

రైల్వే స్టేషన్ బిల్డింగ్ పైన 15 KwPతో కూడిన సోలార్ పవర్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేశారు. ఇక స్టేషన్ కు వచ్చే దివ్యాంగుల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి.

(7 / 8)

రైల్వే స్టేషన్ పరిసరాల్లో పచ్చదనం, పరిశుభ్రతతో ఆహ్లాదపరిచేలా లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, మొక్కలతో అభివృద్ధి చేశారు. రాత్రి వేళలో లైటింగ్ తో కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఖతర్నాక్ లుక్ లో కనిపిస్తోంది.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు