Kareena Kapoor Khan: బ్లాక్ అవుట్‌ఫిట్‌లో సెక్సీగా కరీనా కపూర్.. 44 ఏళ్ల వయసులోనూ గ్లామర్ ట్రీట్ (ఫొటోలు)
Kareena Kapoor In Black Dolce And Gabbana Dress: దేవర మూవీ విలన్ సైఫ్ అలీ ఖాన్ భార్య, హీరోయిన్ కరీనా కపూర్ తాజాగా అదిరిపోయే గ్లామర్ ట్రీట్ అందించింది. బ్లాక్ డోల్స్ అండ్ గబ్బానా డ్రెస్‌లో మెరిసిపోతూ బోల్డ్ పోజులు ఇచ్చింది. 44 ఏళ్ల వయసులోనూ కరీనా కపూర్ గ్లామర్‌కు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
(1 / 7)
కరీనా కపూర్ ఎప్పుడు స్టన్నింగ్ ఫ్యాషన్‌తో అలరిస్తుంటుంది. తాజాాాగా ఆల్ బ్లాక్, స్టన్నింగ్ డ్రెస్‌లో ఆమె లేటెస్ట్ లుక్ పిక్స్‌ను షేర్ చేసింది. ఆమె లుక్ గురించి మరింత తెలుసుకోవడానికి క్రిందికి స్క్రోల్ చేయండి.
(Instagram/@kareenakapoorkhan)(2 / 7)
గురువారం కరీనా తన అభిమానులకు స్వీట్ సర్‌ప్రైజ్ ఇచ్చింది, ఇన్‌స్టాగ్రామ్‌లో వరుస గ్లామర్ ఫోటోలను అప్లోడ్ చేసింది, "క్షమించండి, నేను ఎంత అద్భుతంగా ఉన్నానో మీరు చెబితే నేను వినలేను.. హహహహ" అంటూ ఫొటోలకు క్యాప్షన్ రాసుకొచ్చింది కరీనా కపూర్ ఖాన్.
(Instagram/@kareenakapoorkhan)(3 / 7)
కరీనా తన లుక్ కోసం బ్లాక్ కలర్ డాల్స్ అండ్ గబ్బానా దుస్తులను ధరించింది, దీని ధర రూ .1,82,185 ఉంటుందని సమాచారం. షీర్, ఫుల్ స్లీవ్ బ్లౌజ్ తో కూడిన నలుపు రంగు కార్సెట్ టాప్ లేయర్ తో కరీనా గ్లామర్‌గా కనిపించింది.
(Instagram/@kareenakapoorkhan)(4 / 7)
ఎక్స్ ట్రా గ్లామర్ కోసం కరీనా ఫుల్ లెంగ్త్ మెర్మైడ్ స్కర్ట్ ధరించింది. దాని ధర రూ.4,14,585 అని సమాచారం.
(Instagram/@kareenakapoorkhan)(5 / 7)
సెలబ్రిటీ స్టైలిస్ట్ లక్ష్మీ లెహర్ సహాయంతో డ్రెస్ డిజైన్ చేసుకుంది. వేలాడుతున్న జాంబియా ఎమరాల్డ్ స్పైక్ చెవిపోగులు, హై హీల్స్ తో తన లుక్ ను పూర్తి చేసింది కరీనా.
(Instagram/@kareenakapoorkhan)(6 / 7)
మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ మన్ చందా సహాయంతో కరీనా తన అందాలను మరింత పెంచేసింది. క్లీన్ అండ్ క్లాసీ లుక్‌లో ఆకట్టుకుంది కరీనా. అలాగే బ్యాక్ సైడ్ నుంచి బోల్డ్ పోజు ఇచ్చి 44 ఏళ్ల వయసులోనూ గ్లామర్‌తో అట్రాక్ట్ చేస్తోంది బాలీవుడ్ బెబో.
(Instagram/@kareenakapoorkhan)ఇతర గ్యాలరీలు