Priyanka Achar: హీరోయిన్‌గా బుల్లితెర బ్యూటి ఎంట్రీ.. టీవీ షోలో చూసి ప్రియాంకకు ఛాన్స్!
- Mahanati Show Winner Priyanka Achar As Heroine: కన్నడ బుల్లితెర షో మహానటికి విన్నర్‌గా నిలిచిన ప్రియాంక ఆచార్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది. ప్రముఖ దర్శక నిర్మాత తరుణ్ సుధీర్ నిర్మాణంలోని ఓ లవ్ స్టోరీ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీతో రక్షిత ప్రేమ్ సోదరుడు రాణా హీరోగా పరిచయం అవుతున్నాడు.

(1 / 6)
కన్నడ దర్శకనిర్మాత తరుణ్ సుధీర్ దగ్గర పనిచేసిన పునీత్ రంగస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నిజ జీవిత ఘటన ఆధారంగా రూపొందుతున్న "ఏడుమలల మడిలో హృదయస్పర్శి ప్రేమకథ" చిత్రంలో మైసూరుకు చెందిన ప్రియాంక ఆచార్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుంది.
(2 / 6)
కన్నడ పాపులర్ టీవీ షో మహానటి టైటిల్ విజేతగా నిలిచిన ప్రియాంక ఆచార్.. తరుణ్ నిర్మాణంలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేస్తున్నారు. మహానటి షో జడ్జిగా ఉన్నప్పుడే ప్రియాంక నటనను తరుణ్ సుధీర్ మెచ్చుకున్నారు.
(3 / 6)
ఇప్పుడు ఆయన నిర్మాణంలోని చిత్రంలో హీరోయిన్‌గా నటించే అవకాశం ప్రియాంకకు లభించింది. కాగా మైసూరుకు చెందిన ప్రియాంకకు నటి కావాలనే కల ఉంది. ఆ కలకు తరుణ్ సహకారం అందిస్తున్నారు.
(4 / 6)
తరుణ్ సుధీర్ కొత్త హీరోయిన్లను పరిచయం చేయడంలో దిట్ట. రాబర్ట్ మూవీతో ఆశా భట్, కాటేర ద్వారా మాలాశ్రీ కుమార్తె ఆరాధనారాం వంటి వారిని సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తీసుకొచ్చారు.
(5 / 6)
ఇప్పుడు మహానటి షోతో కన్నడ బుల్లితెర ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ప్రియాంక ఆచార్‌ను తన నిర్మాణంలో తెరకెక్కుతోన్న సినిమాలో ఛాన్స్ ఇచ్చారు తరుణ్ సుధీర్. అలాగే, ఈ సినిమాతో రక్షిత ప్రేమ్ సోదరుడు రాణా హీరోగా పరిచయం అవుతున్నాడు.
ఇతర గ్యాలరీలు