Telangana Tourism : కనకగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తారా..? మీకోసమే ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ, ధర చాలా తక్కువ
- Kanakagiri Treking : తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. కనకగిరి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఆసక్తిగల వారు పేర్లు నమోదు చేసుకునే ప్రాసెస్ ను కూడా ప్రారంభించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
- Kanakagiri Treking : తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. కనకగిరి అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కోసం ఏర్పాట్లను సిద్ధం చేసింది. ఆసక్తిగల వారు పేర్లు నమోదు చేసుకునే ప్రాసెస్ ను కూడా ప్రారంభించింది. ఈ మేరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
(1 / 7)
ఎత్తైన కొండలు, ఎన్నో వృక్షాలు, అబ్బురపరిచే జలపాతం, ఆపై పచ్చని ప్రకృతి… ఇవన్నీ చూడాలంటే కొత్తగూడెం జిల్లాలోని కనకగిరి గుట్టలను చూడాల్సిందే..! అయితే అలాంటి అవకాశాన్ని తెలంగాణ టూరిజం శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు స్పెషల్ ప్యాకేజీని ప్రకటించింది.
(2 / 7)
ఎంతో ఎత్తులో ఉండే కనకగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేసే అవకాశాన్ని టూరిజం శాఖ కల్పించింది. ఇందుకు సంబంధించిన వివరాలను భదాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రకటించింది. సోషల్ మీడియాలో (X) రిజిస్ట్రేషన్ లింక్ ను కూడా పోస్ట్ చేసింది.
(3 / 7)
కనకగిరి కొండల్లో ఆరు కిలో మీటర్లు ట్రెక్కింగ్ చేయవచ్చు. పైగా కిందికి మరో 6 కిమీ పాటు ఉంటుంది.
(4 / 7)
18 ఏళ్లకు పైగా ఉన్న వారికి మాత్రమే ట్రెక్కింగ్ అవకాశం ఉంటుంది. మొత్తం 2 రోజులు ఉంటారు. శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. టికెట్ ధర ఒక్కరికి రూ. 2వేలుగా నిర్ణయించారు
(Image Source @Collector_BDD )(5 / 7)
ఈ ప్యాకేజీ హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంటుంది. శనివారం ఉదయం 11 గంటలకు బయల్దేరుతారు. సాయంత్రం 4 గంటలకు కొత్తగూడెం చేరుకంటారు. సాయంత్రం చంద్రుగొండ మండల కేంద్రానికి చేరుతారు. ఆ తర్వాత కొన్ని యాక్టివిటిస్ ఉంటాయి. 8 గంటలకు డిన్నర్ ఉంటుంది. రాత్రి క్యాంప్ లో నిద్రిస్తారు.
(Image Source @Collector_BDD )(6 / 7)
ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. 7 గంటలకు కనకగిరి ట్రెక్కింగ్ ప్రారంభమవతుంది. మధ్యాహ్నం 2 గంటలకు లంచ్ ఉంటుంది. 4 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో ప్యాకేజీ ముగుస్తుంది.
(7 / 7)
ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకునేందుకు లింక్ : https://linktr.ee/explorebhadradri
ఇతర గ్యాలరీలు