ICC Awards: బ్రాడ్‍మన్ రికార్డు సమం చేసిన యంగ్ ప్లేయర్‌కు ఐసీసీ ఎమర్జింగ్ అవార్డు: వివరాలివే
- ICC Awards: శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్‍కు ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. 2024కు గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు.
- ICC Awards: శ్రీలంక యువ బ్యాటర్ కమిందు మెండిస్‍కు ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కింది. 2024కు గాను ఈ అవార్డు దక్కించుకున్నాడు.
(1 / 5)
గతేడాది 2024లో శ్రీలంక యంగ్ బ్యాటర్ కమిందు మెండిస్ అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్టుల్లో భారీ స్కోర్లతో దుమ్మురేపాడు. దీంతో మెండిస్‍కు గుర్తింపు దక్కింది.
(AFP)(2 / 5)
2024కు గాను ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కమిందు మెండిస్‍కు దక్కింది. ఈ అవార్డును ఐసీసీ నేడు (జనవరి 26) ప్రకటించింది. ఈ అవార్డుకు అతడితో పాటు ఇంగ్లండ్ ప్లేయర్ గస్ అట్కిన్‍సన్, వెస్టిండీస్ ఆటగాడు షెమార్ జోసెఫ్, పాకిస్థాన్ బ్యాటర్ నయీమ్ అయూబ్ కూడా నామినేట్ అయ్యారు. చివరికి కమిందు మెండిస్‍కు ఈ అవార్డు సొంతమైంది.
(3 / 5)
2024లో 9 టెస్టుల్లో 1049 పరుగులు చేసి సత్తాచాటాడు కమిందు మెండిస్. ఏకంగా ఐదు సెంచరీలు, మూడు అర్ధ శతకాలు బాదాడు. గతేడాది అతడి సగటు 74.92గా ఉంది. అద్భుత ఆటతీరుతో కమిందు అదరగొట్టాడు.
(AFP)(4 / 5)
టెస్టుల్లో అత్యంత వేగంగా 1000 పరుగుల మార్క్ చేరిన రికార్డులో లెజెండ్ బ్రాడ్‍మన్‍ను కమిందు మెండిస్ సమం చేశాడు. 13 ఇన్నింగ్స్‌లోనే 1000 టెస్టు రన్స్ సాధించి ఆ రికార్డు నెలకొల్పాడు. 1949లో బ్రాడ్‍మన్ 13 ఇన్నింగ్స్‌లో 1000 పరుగుల మార్క్ దాటాడు. అద్భుత బ్యాటింగ్‍తో దాన్ని 2024లో మెండిస్ సమం చేశాడు.
(AFP)ఇతర గ్యాలరీలు