Kakinada News : గోదారోళ్ల ఆతిథ్యం అదుర్స్, కొత్త అల్లుడికి 100 రకాల వంటకాలతో మెగా విందు
- Kakinada News : గోదారోళ్లంటే గుర్తుకొచ్చేది ఆతిథ్యమే. గోదారోళ్ల ఆతిథ్యం కూడా వెరైటీగా ఉంటుంది. ఇక కొత్త అల్లుళ్లను చూసుకోవడంతో గోదారోళ్ల తరువాతే మరెవ్వరైనా. ఆదివారం కాకినాడ జిల్లా తామరాడ గ్రామంలో ఒక కుటుంబంలో అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. వంద రకాల వంటకాలతో విందును ఏర్పాటు చేశారు.

(1 / 6)
గోదారోళ్లంటే గుర్తుకొచ్చేది ఆతిథ్యమే. గోదారోళ్ల ఆతిథ్యం కూడా వెరైటీగా ఉంటుంది. ఇక కొత్త అల్లుళ్లను చూసుకోవడంతో గోదారోళ్ల తరువాతే మరెవ్వరైనా. అంతగా అల్లుళ్లకు ప్రాధాన్యత ఇస్తారు. అందులో భాగంగానే అల్లుడు ఇంటికి వచ్చాడంటే, ఆతిథ్యంలో ఎక్కడా తక్కువ చేయరు.
(2 / 6)
ఆదివారం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామంలో ఒక కుటుంబంలో అల్లుడికి అదిరిపోయే ఆతిథ్యం ఇచ్చారు. ఏకంగా వంద రకాల వంటకాలతో మెగా విందును ఏర్పాటు చేసి అదరహో అనిపించారు.
(3 / 6)
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం తామరాడ గ్రామానికి రత్నకుమారికి, కాకినాడకు చెందిన రవితేజకు గతేడాది సెప్టెంబర్‌లో వివాహం జరిగింది. ఆషాడం ముగిసిన తరువాత తొలిసారిగా అత్తారింటికి వచ్చిన అల్లుడికి అత్తమామలు ఏకంగా వంద రకాల పిండివంటలతో భోజన ఏర్పాట్లు చేశారు.
(4 / 6)
వివిధ రకాల ఆహారం, స్వీట్స్, హాట్, ఫ్రూట్స్ ఇలా వంద రకాల వంటకాలు అల్లుడి ముందు ఉంచారు. బిర్యానీ, పులిహార, పరమన్నం, లెమన్ రైస్, గ్రీన్ రైస్ వంటి ఆహార పదార్థాలు పెట్టారు. అలాగే చేపలు, పీతలు, మటన్, చికెన్, రొయ్యలు వంటి నాన్ వెరైటీలు విందులో ఏర్పాటు చేశారు.
(5 / 6)
గులాబ్ జామ్, మిఠాయి, రసగుల్లా, లడ్డు, చలివిడి, జాంగ్రీ, కాజా, పూతరేకులు, కేకులు ఇలా అనేక రకాల స్వీట్స్, జంతికులు, చేగొడియాలు, చక్కిడాలు, కారపుబూందీ, మిక్చిర్ వంటి వివిధ రకాల హాట్ పదార్థాలు విందులో ఏర్పాటు చేశారు.
ఇతర గ్యాలరీలు