(1 / 6)
కాచిగూడ-యశ్వంత్‌పూర్ మార్గంలో నడుస్తున్న వందేభారత్ రైలు స్పీడ్ పెంచుతున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేసింది.
(Twitter)(2 / 6)
స్పీడ్ పెంపు నిర్ణయం డిసెంబర్ 21, 2023వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ రూట్ లో నడిచే రైలు కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు చేరుకుంటుంది. ప్రయాణ సమయం 8.30 గంటలగా ఉంది. రైల్వేశాఖ నిర్ణయంతో… రైలు వేగాన్ని 15 నిమిషాల మేర పెంచడంతో ఈ సమయంలోనూ పావుగంట కలిసి రానుంది.
(Twitter)(3 / 6)
ఇవాళ్టి నుంచి ఈ రైలు కాచిగూడలో ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. యశ్వంత్‌పూర్ చేరుకునే సమయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని రైల్వే శాఖ స్పష్టం చేసింది.
(Twitter)(4 / 6)
మరోవైపు తిరుగు ప్రయాణంలో చూస్తే…. గతంలో రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకోగా, ఇప్పుడు 11 గంటలకే చేరుకోనుంది.
(Twitter)(5 / 6)
మొత్తంగా చూస్తే…. గతం కంటే ఇప్పుడు 15 నిమిషాల ప్రయాణ సమయం తగ్గింది. ఇప్పటివరకు ఈ రైలు గమ్యస్థానం చేరుకునేందుకు 8.30 గంటల సమయం పట్టగా… ఇకపై 8.15 గంటల్లో చేరుకుంటుంది.
(Twitter)(6 / 6)
దక్షిణ మధ్య రైల్వే తాజాగా ప్రకటించిన టైమింగ్ వివరాలు ఈ చిత్రంలో చూడవచ్చు. వేగం పెంపునకు అనుగుణంగా.. మిగతా రైళ్ల రాకపోకల విషయంలో చర్యలు తీసుకుంది దక్షిణ మధ్య రైల్వే.
(SCR Twitter)ఇతర గ్యాలరీలు