(1 / 6)
ధృక్ పంచాగం ప్రకారం, గురువు (బృహస్పతి) రేపు మే 14వ తేదీన రాత్రి 11.20 గంటలకు వృషభాన్ని వీడి మిథున రాశిలోకి ప్రవేశించనున్నాడు. రేపటి నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు మిథున రాశిలోనే గురువు సంచరిస్తాడు. ఈ కాలంలో ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి. ఆ రాశులు ఏవంటే..
(2 / 6)
ధనస్సు: మిథున రాశిలో గురువు సంచరించే కాలం ధనూ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. వీరికి అదృష్టం మద్దుతు ఎక్కువగా లభిస్తుంది. ఉత్సాహంగా పని చేస్తారు. వ్యాపారులకు లాభాలు అధికం అవుతాయి. ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే అవి పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. ప్రశాంతత నెలకొంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.
(3 / 6)
కుంభం: మిథునంలో గురువు సంచారం కుంభ రాశి వారికి మంచి సమయాన్ని తెచ్చిపెడుతుంది. వీరికి అన్నింటా పరిస్థితులు కలిసి వస్తాయి. లక్ వల్ల కొన్ని పనులు సులువుగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి గంటే కంటే బాగుంటుంది. తోబుట్టువులతో విభేదాలు తొలగిపోతాయి. కోర్టు విషయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి సానుకూలంగా ఉంటుంది.
(4 / 6)
మీనం: ఈ కాలంలో మీనరాశి వారికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. దీంతో విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ పెరుగుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఇతరులతో ప్రశంసలు పొందుతారు. ధనపరమైన లాభాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని విషయాల్లో బంధువు నుంచి సపోర్ట్ దక్కుతుంది.
(5 / 6)
కన్య: ఈ కాలంలో కన్యా రాశి వారికి కూడా టైమ్ అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు పరిస్థితులు బాగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం సంతోషంగా గడుపుతారు. విహార యాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు. డబ్బు విషాయాల్లో లక్ బాగా ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా ధనం సిద్ధిస్తుంది.
(Pixabay)(6 / 6)
మకరం: మిథున రాశిలో గురువు సంచరించే కాలం మకరరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మనసుకు హాయి కలుగుతుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. కలహాలు తీరిపోతాయి. పెళ్లి కోసం ప్రయత్నించే వారికి సంబంధం కుదిరే అవకాశాలు మెండుగా ఉంటాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు ఆచితూచి చేస్తారు. (గమనిక: విశ్వాసాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)
ఇతర గ్యాలరీలు