Supermoon in July 2022 : చంద్రుడిని బక్‌మూన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా?
- Supermoon in July 2022 : జూలైలోని సూపర్మూన్ని 'బక్ మూన్' అంటారు. అసలు బక్ మూనే అనే పేరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచించేస్తున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. పైగా ఈ జూలైలో సూపర్‌మూన్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
- Supermoon in July 2022 : జూలైలోని సూపర్మూన్ని 'బక్ మూన్' అంటారు. అసలు బక్ మూనే అనే పేరు ఎలా వచ్చింది అని మీరు ఆలోచించేస్తున్నారా? అయితే మీరు ఇది చదవాల్సిందే. పైగా ఈ జూలైలో సూపర్‌మూన్ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 6)
గత నెలలో 'సూపర్‌మూన్' వచ్చింది. అలాగే ఈ నెలలో కూడా సూపర్‌మూన్ రానుంది. జూన్‌లో 'స్ట్రాబెర్రీ మూన్' కనిపించగా.. జూలైలో 'బక్ మూన్' రానుంది. మరీ ఈ నెలలో బక్‌మూన్ ఎప్పుడు కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 6)
జూలైలో చంద్రుని రంగు లేత నారింజ రంగులో ఉంటుంది. ముఖ్యంగా ఫ్రాంక్‌ఫర్ట్, న్యూయార్క్, ఇస్తాంబుల్, బీజింగ్‌లోని ప్రజలు ఈ చంద్రుడిని చూస్తారు.
(Instagram)(3 / 6)
అమెరికా అంతరిక్ష శాస్త్ర పరిశోధనా కేంద్రం నాసా తెలిపిన వివరాల ప్రకారం.. జూలై 13వ తేదీ అనగా బుధవారం చంద్రుడు కనిపించనున్నాడు. చాలా అందంగా వరుసగా మూడు రోజుల పాటు ఆకాశంలో మెరిసిపోతాడు. చంద్రుడు భూమికి అతి దగ్గరగా వెళ్లినప్పుడు మాత్రమే అలాంటి 'సూపర్ మూన్' కనిపిస్తుందని వెల్లడించారు.
(4 / 6)
ఈ చంద్రుడిని 'బాక్ మూన్' అని ఎందుకు పిలుస్తారో అనే క్యూరియాసిటీ రావచ్చు? నిజానికి 'బాక్' అంటే ఆంగ్లంలో మగ జింక అని అర్థం. అనేక పాశ్చాత్య దేశాలలో.. జింక కొమ్ములు ఈ కాలంలో పెరగడం ప్రారంభిస్తాయి. ఈ కారణంగానే.. చంద్రున్ని బాక్ మూన్ అని పిలుస్తారు.
(AP)(5 / 6)
బుధవారం (జూలై 13) ఉదయం 5:00కి.. చంద్రుడు భూమికి అత్యంత సమీపానికి చేరుకుంటాడు. పౌర్ణమి ఆగ్నేయ హోరిజోన్ నుంచి 5 డిగ్రీల ఎత్తులో కనిపిస్తుందని NASA తెలిపింది.
సంబంధిత కథనం
ఇతర గ్యాలరీలు