(1 / 5)
టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర చిత్రం జపాన్‍లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. మార్చి 28న జపనీస్‍లో విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్ల కోసం జపాన్ వెళ్లారు ఎన్టీఆర్.
(2 / 5)
జపాన్ రాజధాని టోక్యోకు ఎన్టీఆర్ చేరుకున్నారు. స్టైలిష్ లుక్‍తో అదరగొట్టారు. బ్లాక్ టీషర్ట్‌పై వైట్ బ్లేజర్ ధరించి ఎలిగెంట్ లుక్‍లో కనిపించారు ఎన్టీఆర్.
(3 / 5)
టోక్యోలో స్టైలిష్ లుక్‍తో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలను దేవర మూవీ టీమ్ పోస్ట్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్‍గా మారాయి. అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు.
(4 / 5)
ఆర్ఆర్ఆర్ చిత్రంతో జపాన్‍లో ఎన్టీఆర్ చాలా పాపులర్ అయ్యారు. అక్కడ చాలా మంది ఎన్టీఆర్ అభిమానులుగా మారారు. దేవర జపాన్ రిలీజ్‍కు చాలా బజ్ కనిపిస్తోంది. అక్కడి మీడియాకు ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ ఇంటర్వ్యూ ఇచ్చారు.
(5 / 5)
దేవర సినిమా గతేడాది సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజైంది. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో సాగే ఈ యాక్షన్ చిత్రం రూ.500కోట్లకు పైగా కలెక్షన్లతో సూపర్ అయింది. ఇప్పుడు మరో నాలుగు రోజుల్లో ఈ మూవీ జపాన్‍లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ నటించగా.. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర చేశారు.
ఇతర గ్యాలరీలు