(1 / 7)
కర్ణాటకలోని జోగ్ వాటర్ ఫాల్స్ అద్భుతంగా ఉంటాయి. వర్షకాలంలో ఇక్కడికి వచ్చేవారి సంఖ్యం పెరుగుతుంది. చాలా ఎత్తున నుంచి నీరు కిందకు పడుతుంది. పైకి నీటి తుంపర్లుగా లేచి తగులుతుంది. ఈ సీన్ చూసేందుకు చాలా బాగుంటుంది.
(2 / 7)
వర్షకాలంలో ఈ జలపాతానికి నీరు అధికంగా వస్తుంది. తాజాగా మల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా లింగనమక్కి జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో జోగ్ జలపాతానికి పూర్వ వైభవం వచ్చింది.
(3 / 7)
శరావతి నది గుండా నీరు ప్రవహిస్తుంది. దీంతో జలపాతాల అందాలు చూడటానికి కనువిందు చేస్తున్నాయి.
(4 / 7)
ముఖ్యంగా జోగ్ ఫాల్స్ దగ్గరకు ఒక్కసారి వెళ్తే మళ్లీ మళ్లీ వెళ్లాలి అనిపిస్తుంది. నీరు కిందకు పడుతుంటే అనుభూతి అద్భుతంగా ఉంటుంది. వర్షాకాలంలో ఇలాంటి దృశ్యాన్ని చూసేందుకు చాలా మంది ఇష్టపడుతారు.
(5 / 7)
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పర్యాటకులు కూడా ఇక్కడకు వెళ్తారు. ఇతర రాష్ట్రాల ప్రజలు కూడా జోగ్ ఫాల్స్ చూసేందుకు ఆసక్తి చూపిస్తారు.
(6 / 7)
వృద్ధుల నుంచి చిన్నపిల్లల వరకు నీరు పై నుంచి కింద పడుతున్న క్షణాలను చూడటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన వారు జోగ్ ఫాల్స్ చూసి మురిసిపోతుంటారు.
(7 / 7)
చాలా మంది జంటలు జోగ్ జలపాతం చూసేందుకు ఇష్టంగా వస్తుంటారు. ప్రియమైన వారితో ఇక్కడ కాసేపు గడుపుతుంటారు.
ఇతర గ్యాలరీలు