Ponting Prediction: సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును జో రూట్ బద్దలుకొట్టగలడు: రికీ పాంటింగ్-joe root can break sachin tendulkar test highest runs record ricky ponting predicted ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ponting Prediction: సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును జో రూట్ బద్దలుకొట్టగలడు: రికీ పాంటింగ్

Ponting Prediction: సచిన్ పేరిట ఉన్న ఆ రికార్డును జో రూట్ బద్దలుకొట్టగలడు: రికీ పాంటింగ్

Published Aug 15, 2024 11:42 PM IST Chatakonda Krishna Prakash
Published Aug 15, 2024 11:42 PM IST

  • Ricky Ponting Prediction on Joe Root: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిటే టెస్టు క్రికెట్ అత్యధిక పరుగుల రికార్డు ఉంది. అయితే, ఈ రికార్డును ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ బద్దలుకొడతాడంటూ ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ అంచనా వేశాడు. ఆ వివరాలివే..

టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ సాధిస్తాడని తాను అనుకుంటున్నట్టు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ చెప్పాడు. రూట్ మరో మూడు, నాలుగేళ్లు ఇప్పుడు ఉన్న జోరు కొనసాగిస్తే అది సాధ్యమవుతుందని చెప్పాడు. 

(1 / 6)

జో రూట్ ఇటీవలే టెస్టుల్లో 12వేల పరుగుల మార్క్ దాటాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‍లో ఉన్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్‍ల్లోనూ ప్రస్తుతం టాప్ ప్లేస్‍కు చేరాడు 33 ఏళ్ల రూట్. ఈ తరుణంలో, సచిన్ రికార్డును రూట్ బ్రేక్ చేస్తాడని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. 

(2 / 6)

భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ 200 టెస్టుల్లో 15,921 పరుగులు చేశాడు. 51 సెంచరీలు, 68 అర్ధ సెంచరీ చేశాడు. అత్యధిక టెస్టు పరుగుల రికార్డు సచిన్ పేరిటే ఉంది. జో రూట్ ఇప్పటి వరకు 143 టెస్టుల్లో 12,027 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న యాక్టివ్ క్రికెటర్లలో టెస్టుల్లో అత్యధిక టెస్టు పరుగులతో ఉన్నాడు.

(3 / 6)

సచిన్ కంటే రూట్ ప్రస్తుతం 3,894 పరుగులు వెనుకబడి ఉన్నాడు. మరో మూడు, నాలుగేళ్లు రూట్ టెస్టులు ఆడుతూ.. రాణిస్తే సచిన్‍ను దాటేస్తాడని రికీ పాంటింగ్ చెప్పాడు. టెస్టు అత్యధిక పరుగుల జాబితాలో రూట్ ప్రస్తుతం ఏడో స్థానంలో ఉన్నాడు. 

(4 / 6)

“అతడు (రూట్) ఆ రికార్డును దాటగలడు. ఇప్పుడు అతడికి 33 ఏళ్లు. సుమారు 3000 పరుగులకుపైగా వెనుకబడి ఉన్నాడు. ఇంగ్లండ్ ఎన్ని టెస్టులు ఆడుతుందనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ సంవత్సరానికి 10 నుంచి 14 టెస్టులు ఆడి.. ఒకవేళ రూట్ ఏడాదికి 800 నుంచి 1,000 టెస్టు పరుగులు చేస్తే, మూడు, నాలుగేళ్లలో అతడు ఆ రికార్డుకు చేరుకుంటాడు. అతడి వయసు అప్పటికి 37కు చేరుతుంది” అని ఐసీసీ రివ్యూలో రికీ పాంటింగ్ చెప్పాడు. 

(5 / 6)

టెస్టు క్రికెట్‍లో అత్యధిక పరుగుల జాబితాలో సచిన్ టెండూల్కర్ (15,921) తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ (13,378) ఉన్నాడు. జాక్ కలిస్ (13,289), రాహుల్ ద్రవిడ్ (13,288), అలెస్టర్ కుక్ (12,472) వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. ఆరో ప్లేస్‍లో ఉన్న కుమార సంగక్కర (12,400) తర్వాతి ప్లేస్‍లో రూట్ (12,027*) ఉన్నాడు. అయితే, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‍లో యాక్టివ్ క్రికెటర్లలో రూటే అత్యధిక టెస్టు పరుగులతో ఉన్నాడు.  

(6 / 6)

ఇతర గ్యాలరీలు