Jio World Plaza Launch: ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైన జియో వరల్డ్ ప్లాజా; ఈ లగ్జరీ మాల్ ప్రత్యేకతలు ఏంటో తెలుసా..?
- రిలయన్స్ లగ్జరీ మాల్ ‘‘జియో వరల్డ్ ప్లాజా (Jio World Plaza)’’ ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు.
- రిలయన్స్ లగ్జరీ మాల్ ‘‘జియో వరల్డ్ ప్లాజా (Jio World Plaza)’’ ముంబైలో అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముకేశ్ అంబానీ కుటుంబ సభ్యులతో పాటు బాలీవుడ్ సెలబ్రిటీస్ హాజరయ్యారు.
(1 / 6)
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముంబైలో విలాసవంతమైన జియో వరల్డ్ ప్లాజా (JWP)ని ఆవిష్కరించింది. ముంబై నడిబొడ్డున బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC)లో ఈ లగ్జరీ ప్లాజా ఉంది.
(Twitter/@@RIL_Updates)(2 / 6)
ఈ ప్లాజా నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్, జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్, జియో వరల్డ్ గార్డెన్‌లలో భాగంగా, విజిటర్స్ కు ఒక సమగ్ర డెస్టినేషన్ గా ఉంటుంది.
(Twitter/@@RIL_Updates)(3 / 6)
జియో వరల్డ్ ప్లాజా (JWP) మొత్తం నాలుగు అంతస్తుల్లో 7.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇందులో ప్రత్యేకంగా లగ్జరీ ఫెసిలిటీలతో రిటైల్, లీజర్, డైనింగ్ కేటగిరీలు ఉన్నాయి.
(Twitter/@@RIL_Updates)(4 / 6)
జియో వరల్డ్ ప్లాజా (JWP) లో 66 లగ్జరీ బ్రాండ్‌ల రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ బాలెన్‌సియాగా, జార్జియో అర్మానీ కేఫ్, పోటరీ బార్న్ కిడ్స్, శామ్‌సంగ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, EL&N కేఫ్ మరియు రిమోవా వంటి ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్స్ కేంద్రాలు ఉన్నాయి. అలాగే, లూయిస్ విట్టన్, గూచీ, కార్టియర్, బ్యాలీ, జార్జియో అర్మానీ, డియోర్, వైఎస్ఎల్, బుల్గారి వంటి ఇతర ప్రసిద్ధ బ్రాండ్‌ల కీలకమైన ఫ్లాగ్‌షిప్ స్టోర్స్ ఉన్నాయి.
(Twitter/@@RIL_Updates)(5 / 6)
Jio వరల్డ్ ప్లాజా (JWP) లో మనీష్ మల్హోత్రా, అబు జానీ-సందీప్ ఖోస్లా, రాహుల్ మిశ్రా, ఫల్గుణి, షేన్ పీకాక్, రీతు కుమార్ వంటి ప్రముఖ డిజైనర్ల ప్రొడక్ట్స్ స్టోర్ట్స్ కూడా ఉన్నాయి.
(Twitter/@@RIL_Updates)ఇతర గ్యాలరీలు