Jay Shah: ఐసీసీ చైర్మన్ పదవి జై షాకు దక్కనుందా? ఈ వారమే సమావేశాలు
- Jay Shah: ఐసీసీ చైర్మన్ పదవిని జై షా దక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ వారం ఐసీసీ ఏజీఎం మీటింగ్ ఉండటంతో ఈ విషయంపై రూమర్లు జోరుగా వస్తున్నాయి.
- Jay Shah: ఐసీసీ చైర్మన్ పదవిని జై షా దక్కించుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ఈ వారం ఐసీసీ ఏజీఎం మీటింగ్ ఉండటంతో ఈ విషయంపై రూమర్లు జోరుగా వస్తున్నాయి.
(1 / 5)
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా… ఐసీసీ పదవికి రెడీ అవుతున్నారని సమాచారం. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తదుపరి చైర్మన్‍గా జై షా నియమితులవుతారని అంచనాలు ఉన్నాయి.
(PTI)(2 / 5)
ఐసీసీ వార్షిక సమావేశాలు (ఏజీఎం) శ్రీలంకలోని కొలంబోలో ఈ శుక్రవారం (జూలై 19) నుంచి నాలుగు రోజుల పాటు సాగనున్నాయి. ఐసీసీ తదుపరి చైర్మన్ ఎవరనే విషయంపై ఈ సమావేశాల్లో చర్చ జరగనుంది.
(3 / 5)
ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్‌లే పదవీ కాలం ఈ ఏడాది చివర్లో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో ఈ ఏడాది డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ పదవిని జై షా చేపడతారనే అంచనాలు ఉన్నాయి.
(4 / 5)
ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీని అమెరికా, వెస్టిండీస్‍ల్లో ఐసీసీ నిర్వహించింది. అయితే, అమెరికా మ్యాచ్‍లు నిర్వహించడం వల్ల వచ్చిన నష్టాల గురించి కూడా ఈ ఏజీఎంలో ఐసీసీ ప్రతినిధులు చర్చించనున్నారు.
(AP)ఇతర గ్యాలరీలు