Jasprit Bumrah IND vs AUS: మరో మైల్‍స్టోన్‍కు చేరువలో బుమ్రా.. ఆ లిస్టులో అశ్విన్ తర్వాత నిలువనున్న స్టార్ పేసర్!-jasprit burmah eyes 200 wickets mile stone in india vs australia 4th test ind vs aus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jasprit Bumrah Ind Vs Aus: మరో మైల్‍స్టోన్‍కు చేరువలో బుమ్రా.. ఆ లిస్టులో అశ్విన్ తర్వాత నిలువనున్న స్టార్ పేసర్!

Jasprit Bumrah IND vs AUS: మరో మైల్‍స్టోన్‍కు చేరువలో బుమ్రా.. ఆ లిస్టులో అశ్విన్ తర్వాత నిలువనున్న స్టార్ పేసర్!

Dec 25, 2024, 07:58 PM IST Chatakonda Krishna Prakash
Dec 25, 2024, 01:06 PM , IST

  • Jasprit Bumrah IND vs AUS: భారత పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఓ మైలురాయికి అత్యంత చేరువలో ఉన్నాడు. మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగే నాలుగో టెస్టులోనే ఇది సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా మరో మైల్‍స్టోన్‍ అధిగమించేందుకు రెడీ అయ్యాడు. టెస్టు క్రికెట్‍లో 200 వికెట్ల మైలురాయికి కేవలం ఆరు వికెట్ల దూరంలోనే బుమ్రా ఉన్నాడు. మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (డిసెంబర్ 26) నాలుగో టెస్టు మొదలుకానుంది. 

(1 / 5)

టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్‍ప్రీత్ బుమ్రా మరో మైల్‍స్టోన్‍ అధిగమించేందుకు రెడీ అయ్యాడు. టెస్టు క్రికెట్‍లో 200 వికెట్ల మైలురాయికి కేవలం ఆరు వికెట్ల దూరంలోనే బుమ్రా ఉన్నాడు. మెల్‍బోర్న్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రేపు (డిసెంబర్ 26) నాలుగో టెస్టు మొదలుకానుంది. (AFP)

నాలుగో టెస్టులోనే ఆరు వికెట్ల పడగొట్టి 200 వికెట్ల మైలురాయిని బుమ్రా చేరుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న ఫామ్‍లో అతడికి ఇది సులువైన విషయమే. ఇప్పటి వరకు 43 టెస్టులు ఆడిన బుమ్రా 83 ఇన్నింగ్స్‌ల్లో 194 వికెట్లు పడగొట్టాడు. 

(2 / 5)

మెల్‍బోర్న్ వేదికగా ఆసీస్‍తో జరిగే బాక్సింగ్ డే టెస్టులో బుమ్రా 200 వికెట్ల మైలురాయిని చేరితే ఓ రికార్డు సృష్టిస్తాడు. భారత్ తరఫున అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అశ్విన్ తర్వాత నిలుస్తాడు. స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 37 టెస్టుల్లోనే 200 వికెట్ల పడగొట్టి ఈ జాబితాలో టాప్‍లో ఉన్నాడు. బుమ్రా రెండో ప్లేస్‍లో నిలువనున్నాడు. ఓవరాల్‍గా 106 టెస్టుల్లో 537 వికెట్లు తీసుకున్న అశ్విన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

(3 / 5)

ఓవరాల్‍గా టెస్టు క్రికెట్‍లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన జాబితాలో పాకిస్థాన్ బౌలర్ యాసిర్ షా (33 టెస్టులు) టాప్‍లో ఉన్నాడు. గిమ్మెడ్ (36 టెస్టులు) రెండో ప్లేస్‍లో ఉండగా.. అశ్విన్ (37 టెస్టులు) మూడో స్థానంలో ఉన్నాడు. మెల్‍బోర్న్ టెస్టులో 200 వికెట్ల మైలురాయి చేరితే బుమ్రా ఈ జాబితాలో 13వ స్థానంలో ఉంటాడు. 

(4 / 5)

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సిరీస్‍లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. సిరీస్‍లో ఇప్పటి వరకు మూడు టెస్టుల్లో 21 వికెట్లు పడగొట్టాడు. 

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు