Jasprit Bumrah: బుమ్రా.. ది వారియర్: 908 బంతులు.. 32 వికెట్లు.. ఓడినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వివరాలివే-jasprit bumrah won player of the tournament in border gavaskar trophy he bowls 151 overs and picks 32 wickets ind vs aus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jasprit Bumrah: బుమ్రా.. ది వారియర్: 908 బంతులు.. 32 వికెట్లు.. ఓడినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వివరాలివే

Jasprit Bumrah: బుమ్రా.. ది వారియర్: 908 బంతులు.. 32 వికెట్లు.. ఓడినా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్: వివరాలివే

Jan 05, 2025, 12:28 PM IST Chatakonda Krishna Prakash
Jan 05, 2025, 12:28 PM , IST

  • Jasprit Bumrah - IND vs AUS Test Series: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‍లో భారత్ ఓడింది. కానీ, టీమిండియా స్టార్ పేసర్ జస్‍‍ప్రీత్ బుమ్రా చరిత్రలో నిలిచే పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లో 1-3తో భారత్ ఓటమి పాలైంది. సిడ్నీలో జరిగిన ఆఖరు టెస్టులో నేడు (జనవరి 5) టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడింది. అయితే, ఈ సిరీస్‍లో భారత స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా అద్భుత బౌలింగ్ చేశాడు. బంతితో అనితర సాధ్యమైన పోరాటం చేశాడు. 

(1 / 7)

(AFP)

ఈ సిరీస్‍లో ఇతర బౌలర్ల నుంచి పెద్దగా సహకారం లేకపోయినా బుమ్రా అదరగొట్టాడు. ఆసీస్ బ్యాటర్లను వణికించాడు. అలుపెరగకుండా లాంగ్ స్పెల్స్ వేసి జట్టు కోసం తీవ్రంగా శ్రమించాడు. తొలి మ్యాచ్‍కు కెప్టెన్సీ చేసి జట్టును గెలిపించాడు. ఆఖరిదైన ఐదో టెస్టులోనూ సారథ్యం వహించాడు. 

(2 / 7)

(BCCI- X)

ఈ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్‍లో ఐదు టెస్టుల్లో ఏకంగా 151.2 ఓవర్లు (908 బంతులు) వేశాడు బుమ్రా. టీమిండియా తరఫున ఈ సిరీస్‍లో అత్యధిక ఓవర్లు సంధించాడు. ఇతర టీమిండియా బౌలర్లు విఫలమవుతున్నా బుమ్రా అదరగొట్టాడు. అద్భుతమైన స్వింగ్ బంతులతో ఆసీస్ బ్యాటర్లకు సవాల్ విసిరాడు. 

(3 / 7)

ఈ ఐదు టెస్టుల సిరీస్‍లో 32 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. 13.06 యావరేజ్‍తో అదరగొట్టాడు. మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్‍లో హయ్యెస్ట్ వికెట్ టేకర్‌గా నిలిచి సత్తాచాటుడు బుమ్రా. ఆసీస్ గడ్డపై ఓ టెస్టు సిరీస్‍లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గానూ చరిత్ర సృష్టించాడు. కాగా, మిగిలిన భారత బౌలర్లంతా కలిసి ఈ సిరీస్‍లో తీసింది 40 వికెట్లే.

(4 / 7)

(AP)

ఆస్ట్రేలియాతో సిరీస్‍లో భారత్ ఓడినా.. బుమ్రా పోరాటం మాత్రం చరిత్రలో నిలిచిపోతుంది. ఆ స్థాయిలో అద్భుత బౌలింగ్‍తో పోరాడాడు. అందుకే ఆసీస్ టైటిల్ గెలిచినా.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు మాత్రం బుమ్రాకే దక్కింది. 

(5 / 7)

గాయం వల్ల ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ చేయలేకపోయాడు. అంతకు ముందు రోజు స్కానింగ్ చేయించుకున్నాడు. బ్యాటింగ్‍కు దిగినా బౌలింగ్ చేయలేకపోయాడు. బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఆసీస్ బ్యాటర్లను.. టీమిండియా బౌలర్లు ఎక్కువసేపు నిలువరించలేకపోయారు. మొత్తంగా బుమ్రా.. వారియర్‌లా ఈ సిరీస్‍లో పోరాడాడు. 

(6 / 7)

ఆసీస్ గడ్డపై బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-3తో పరాజయం పాలైంది భారత్. గత వరుసగా నాలుగుసార్లు బీజీటీ టైటిల్ దక్కించుకున్న టీమిండియా ఈసారి కోల్పోయింది. పదేళ్ల తర్వాత ట్రోఫీ దక్కించుకుంది ఆసీస్. డబ్ల్యూటీసీ ఫైనల్‍కు కూడా ఆసీస్ చేరింది. భారత్.. డబ్ల్యూటీసీ తుదిపోరు రేసు నుంచి ఔట్ అయింది. 

(7 / 7)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు