
(1 / 5)
2024 సంవత్సరానికి గాను టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కోసం నామినేషన్లను ఐసీసీ ప్రకటించింది. నలుగురిని ఎంపిక చేసింది. టీమిండియా స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా ఈ అవార్డుకు నామినేట్ అయ్యాడు. మరో ముగ్గురు కూడా పోటీలో నిలిచారు.
(AFP)
(2 / 5)
జస్‍ప్రీత్ బుమ్రా ఈ ఏడాది 2024లో 13 టెస్టుల్లో 71 వికెట్లు పడగొట్టాడు. 14.92 సగటుతో అదరగొట్టారు. అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. కెరీర్లో ఓ ఏడాదిలో బుమ్రాకు ఇవే అత్యధిక వికెట్లు.
(AP)
(3 / 5)
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ఈ ఏడాది అద్భుత ఫామ్‍లో ఉన్నాడు. 2024లో 17 టెస్టుల్లోనే 55.78 సగటుతో 1,556 పరుగులు చేశాడు. ఏకంగా ఆరు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు బాదాడు. దీంతో ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
(AP)
(4 / 5)
ఇంగ్లండ్ నుంచి హ్యారీ బ్రూక్ కూడా ఈ అవార్డు రేసులో నిలిచాడు. ఈ ఏడాది బ్రూక్ 12 టెస్టుల్లో 1,110 పరుగులు సాధించాడు. 55 సగటు నమోదు చేశాడు. అదిరిపోయే బ్యాటింగ్ చేశాడు.
(AP)
(5 / 5)
శ్రీలంక ఆటగాడు కమిందు మెండిస్ కూడా.. ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ ఏడాది 9 టెస్టుల్లో 1,049 పరుగులు చేశాడు. ఈ సంవత్సరం అతడి సగటు ఏకంగా 74.92గా ఉంది. త్వరలోనే ఈ నలుగురిలో అవార్డు విజేతను ఐసీసీ ఖరారు చేయనుంది.
(AFP)ఇతర గ్యాలరీలు