(1 / 5)
స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అదరగొట్టాడు. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ పై నాలుగు వికెట్లతో చెలరేగిన అతను రికార్డు అందుకున్నాడు.
(AP)(2 / 5)
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ముంబయి ఇండియన్స్ బౌలర్ గా బుమ్రా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ టాప్ లో ఉన్న లసిత్ మలింగను బుమ్రా వెనక్కినెట్టాడు.
(AFP)(3 / 5)
ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ తరపున బుమ్రా 139 మ్యాచ్ ల్లో 174 వికెట్లు పడగొట్టాడు. అతని సగటు 22.38 కాగా.. ఎకానమీ 7.31గా ఉంది. మలింగ 122 మ్యాచ్ ల్లో 170 వికెట్లు తీశాడు. ఇప్పుడు మలింగ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.
(Hindustan Times)(4 / 5)
ఐపీఎల్ తో పాటు ఛాంపియన్స్ లీగ్ టీ20 కూడా చూసుకుంటే ముంబయి తరపున అత్యధిక వికెట్ల వీరుడిగా మలింగ కొనసాగుతున్నాడు. అతను 195 వికెట్లు తీశాడు. బుమ్రా 177 వికెట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.
(PTI)ఇతర గ్యాలరీలు