(1 / 5)
జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్ బుమ్రా నాలుగు వికెట్స్ తీశాడు. ఈ క్రమంలో కపిల్ దేవ్ 32 ఏళ్ల రికార్డును బుమ్రా బద్దలు కొట్టాడు.
(ఏఎఫ్‌పీ)(2 / 5)
బాక్సింగ్ డే టెస్టు రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెనర్ సామ్ కొన్‌స్టాస్‌ను బుమ్రా ఔట్ చేశాడు. అందుకే తన పేరును రికార్డు పుస్తకంలో లిఖించుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు సిరీస్‌లో జస్ప్రీత్‌కు ఇది 26వ వికెట్. ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత పేసర్‌గా నిలిచాడు బుమ్రా. అంటే ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో మరే భారత పేసర్ ఇన్ని వికెట్లు తీయలేకపోయాడు.
(బీసీసీఐ)(3 / 5)
ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా కపిల్ దేవ్ నిలిచాడు. 1991-92లో ఆస్ట్రేలియాలో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొత్తం 25 వికెట్లు పడగొట్టాడు. కపిల్ 10 ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసి ఈ ఘనత సాధించాడు.
(ఏఎఫ్‌పీ)(4 / 5)
అయితే ఈ జాబితాలో జస్ప్రీత్ మూడో స్థానంలో కూడా ఉన్నాడు. 2018-19 సీజన్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో మొత్తం 21 వికెట్లు పడగొట్టాడు. అప్పుడు కపిల్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోయాడు. కానీ, ఈసారి మాత్రం రికార్డ్ బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం జరుగుతున్న సిరీస్‌లో జస్ప్రీత్ తన వికెట్ల సంఖ్యను పెంచుకునే అవకాశం ఉంది.
(ఏఎఫ్‌పీ)(5 / 5)
ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా జస్ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఈ విషయంలో ఆయనకు దగ్గరిలో ఎవరూ లేరు. చివరికి బుమ్రా టెస్టు సిరీస్‌ను అత్యధిక వికెట్లు తీసిన పేసర్‌గా ముగించే అవకాశం ఉంది.
(ఏఎఫ్‌పీ)ఇతర గ్యాలరీలు