OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ చెల్లెలి రొమాంటిక్ కామెడీ చిత్రం.. పెళ్లికి ముందే ఆ పని.. ఇక్కడ చూడండి!-janhvi kapoor sister khushi kapoor romantic comedy movie loveyapa ott streaming on disney plus hotstar today ott release ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ చెల్లెలి రొమాంటిక్ కామెడీ చిత్రం.. పెళ్లికి ముందే ఆ పని.. ఇక్కడ చూడండి!

OTT: ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ చెల్లెలి రొమాంటిక్ కామెడీ చిత్రం.. పెళ్లికి ముందే ఆ పని.. ఇక్కడ చూడండి!

Published Apr 04, 2025 02:21 PM IST Sanjiv Kumar
Published Apr 04, 2025 02:21 PM IST

  • Loveyapa OTT Streaming Today: ఓటీటీలోకి ఇవాళ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ నటించిన రొమాంటిక్ కామెడీ చిత్రం లవ్‌యాపా స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఇందులో ఖుషీ కపూర్‌కు జోడీగా మహారాజ్ ఫేమ్ జునైద్ ఖాన్ నటించాడు. అశుతోష్ రాణా కీలక పాత్ర పోషించిన లవ్‌యాపా ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

దేవర బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్, జునైద్ ఖాన్ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ మూవీ లవ్ యాపా ఓటీటీ రిలీజ్ అయింది. థియేట్రికల్ రిలీజ్ అయిన రెండు నెలల తర్వాత లవ్ యాపా ఓటీటీ స్ట్రీమింగ్‌కు ఇవాళ వచ్చేసింది.

(1 / 8)

అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన లవ్‌యాపా 2022లో వచ్చిన తమిళ చిత్రం లవ్ టుడేకు బాలీవుడ్ రీమేక్.పెళ్లికి ముందు ఫోన్లు మార్చుకుని తమ ప్రేమను పరీక్షించుకునే యువ జంట కథ ఇది.

(2 / 8)

లవ్‌యాపా కథ విషయానికొస్తే.. బానీ, గౌరవ్ ప్రేమలో ఉంటారు .చాలా మంది జెన్-జెడ్ జంటల మాదిరిగా వీరిద్దరూ గాఢంగా ప్రేమలో ఉన్నప్పటికీ ఇద్దరూ తమ ఫోన్‌లను విడిచిపెట్టడానికి ఇష్టపడరు. ఇది వారి సంబంధంలో సంఘర్షణకు దారితీస్తుంది. ఒక రాత్రి, ఇద్దరూ తమ ఫోన్లను మార్చుకునే ఛాలెంజ్‌ను ఎదుర్కొంటారు.

(3 / 8)

ఈ సమయంలో వీరిద్దరూ ఫోన్‌లో ఫోటోలు, సందేశాలు, చిత్రాలు, సోషల్ మీడియా ఖాతాలతో సహా అన్ని విషయాలను చూడటానికి అనుమతించాల్సి ఉంటుంది. ఈ ఫోన్ ఎక్స్‌చేంజ్ వెనుక ఉద్దేశ్యం ఇద్దరి మధ్య ఏదైనా రహస్యం బయటకపడుతుందా లేదా అనేది తెలియడానికి.

(4 / 8)

మొదట్లో ఈ విధంగా ఫోన్లు ఎక్స్‌చేంజ్ చేసి ఆత్మవిశ్వాసంతో, దాచడానికి ఏమీ లేదనే మనస్తత్వంతో ఇద్దరూ ఉంటారు. కానీ, ఒక రోజు రాత్రి ఒకరి ఫోన్లను మరొకరు చెక్ చేసుకున్న తర్వాత వారికి కొత్త విషయాలు తెలుస్తాయి.

(5 / 8)

గౌరవ్ ఇతర మహిళలతో రొమాంటిక్ చాటింగ్ చేసిన పాత కథ గురించి బానీకి తెలుస్తుంది. అదే సమయంలో బానీకి గత సంబంధాలు అనుమానాస్పదంగా ఉంటాయి. అలాగే ఒక అనుమానాస్పద ఆన్లైన్ చాటింగ్ వెలుగులోకి వస్తుంది. దీని తరువాత చాలా గందరగోళం, అనుమానం మొదలవుతుంది. ఆన్‌లైన్ ప్రపంచంలో అపోహలు ఎలా ఉన్నాయో ఈ చిత్రం తెలియజేస్తుంది.

(6 / 8)

ఫోన్లు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత వారిద్దరికీ రాత్రి గడపడం కష్టమవుతుంది. భయాలు, బలహీనతలు ఆవరిస్తాయి. వారు కనిపెట్టిన సత్యం నిజమో, కాదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఈ డిజిటల్ ప్రపంచంలో నిజమైన ప్రేమ ఉంటుందా అనే ప్రశ్నను ఈ చిత్రం లేవనెత్తుతుంది.

(7 / 8)

ఇదిలా ఉంటే, 2025 ఫిబ్రవరి 7న థియేటర్లలో విడుదలైన లవ్‌యాపా మూవీకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద కూడా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ లవ్‌యాపా ఓటీటీ రిలీజ్ అయింది. ఏప్రిల్ 4 శుక్రవారం అంటే ఇవాళ్టీ నుంచి జియోహాట్‌స్టార్ లేదా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో లవ్‌యాపా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

(8 / 8)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు