(1 / 5)
జూనియర్ ఎన్టీఆర్ మూవీ దేవరతో టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఈ చిత్రం సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ - డైరెక్టర్ బుచ్చిబాబు చిత్రంలోనూ (RC16)లోనూ జాన్వీ హీరోయిన్‍గా నటించనున్నారు.
(2 / 5)
అయితే, మరో తెలుగు సినిమాలో హీరోయిన్‍గా నటించేందుకు జాన్వీ కపూర్‌కు ఛాన్స్ వచ్చినట్టు రూమర్లు వచ్చాయి. నేచురల్ స్టార్ నాని మూవీకి హీరోయిన్‍గా జాన్వీతో చర్చలు సాగుతున్నట్టు సమాచారం బయటికి వచ్చింది.
(3 / 5)
తనకు దసరా లాంటి బ్లాక్‍బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో మరో మూవీ చేయనున్నారు నాని. ఈ చిత్రంలో హీరోయిన్‍గా చేసేందుకు మూవీ టీమ్ జాన్వీ కపూర్‌తో చర్చలు జరుపుతోందని సమాచారం.
(4 / 5)
ఈ చర్చలు సఫలమైతే నానితో జాన్వీ రొమాన్స్ చేయనున్నారు. అయితే, జాన్వీ భారీగా రెమ్యూనరేషన్ అడుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఫిక్స్ అయితే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఓకే చెబితే తెలుగులో జాన్వీకి మూడో సినిమా కానుంది.
(5 / 5)
నాని ప్రస్తుతం సరిపోదా శనివారం మూవీతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఆగస్టు 29వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెలతోనే నాని మూవీ చేయనన్నారు.
ఇతర గ్యాలరీలు