తెలుగు న్యూస్ / ఫోటో /
Janhvi Kapoor: బాయ్ ఫ్రెండ్ పేరున్న నెక్లెస్ వేసుకున్న జాన్వీ కపూర్.. ఆమె మినీ డ్రెస్ ధర తెలిస్తే..!
Janhvi Kapoor With BF Necklace And Dress Price: దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఆమె లుక్స్‌కి ఫ్యాన్స్ ఎప్పుడూ ఫిదా అయిపోతుంటారు. అయితే ఇప్పుడు ఆమె ధరించిన ఓ డ్రెస్ ధర, మెడలోని జాన్వీ బాయ్ ఫ్రెండ్ పేరుతో ఉన్న నెక్లెస్ అందరి దృష్టిని ఆకర్షించాయి.
(1 / 6)
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అభిమానులు ఎప్పుడూ ఆమె లుక్‌కి ఫిదా అయిపోతుంటారు. జాన్వీ కొన్నిసార్లు ట్రెడిషనల్ లుక్ లో, కొన్ని సార్లు వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తుంటుంది.ఇటీవల జాన్వీ లుక్ ఒకటి అందరి దృష్టిని ఆకర్షించింది. (Instagram/@janhvikapoor)
(2 / 6)
జాన్వీ బ్లాక్ అండ్ వైట్ డీప్ నెక్ మినీ డ్రెస్ ధరించింది. మెట్లపై అదిరే పోజులతో ఆకట్టుకుంది జాన్వీ. అయితే ఈ ఫొటోల్లో ఆమె తన థైస్ షో చేసింది. (Instagram/@janhvikapoor)
(3 / 6)
లూజ్ హెయిర్, మెడలో రూమర్డ్ బాయ్ ఫ్రెండ్ పేరు ఉన్న డైమండ్ నెక్లెస్, చేతిలో ఉంగరంతో జాన్వీ కపూర్ లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. జాన్వీ కపూర్ శిఖర్ పహారియాను ప్రేమిస్తున్నట్లు టాక్ వస్తోంది. ఆమె వేసుకున్న నెక్లెస్ శిఖు అని ఉంది. (Instagram/@janhvikapoor)
(4 / 6)
కాగా జాన్వీ వేసుకన్న మినీ డ్రెస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే. ఇది డిజైనర్ బ్రాండ్ అయినా అలెజాండ్రా రిచ్ డ్రెస్. దీని ధర 2232 డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 1.86 లక్షల రూపాయలు.(Instagram/@janhvikapoor)
(5 / 6)
ఫ్యాషన్ స్టైలిస్ట్ మనీషా మెల్వానీ డిజైన్ చేసిన ముత్యాల చెవిపోగులను జాన్వీ ధరించింది. దీంతో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. అలాగే ఇందులో జాన్వీ టైట్ క్లీవేజ్ షో చేసింది. (Instagram/@janhvikapoor)
ఇతర గ్యాలరీలు