
(1 / 6)
బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇటలీలో ఎంజాయ్ చేస్తున్నారు. అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ రెండో ప్రీ-వెడ్డింగ్ ఈవెంట్‍కు ఆమె వెళ్లారు.

(2 / 6)
ఈ పార్టీకి సంబంధించిన ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో పంచుకున్నారు జాన్వీ కపూర్. తన బాయ్‍ఫ్రెండ్ శిఖర్ పహారియా చేతిలో చెయ్యి వేసుకొని ఇటలీలో ఇలా విహరించారు జాన్వీ.

(3 / 6)
ఎల్లో కలర్ ఫ్లోరల్ డ్రెస్ ధరించారు జాన్వీ. మెరూన్ జాకెట్, వైట్ ప్యాంట్ వేసుకున్నారు శిఖర్. ఈ పార్టీలో వీరు సందడి చేశారు. వీరితో పాటు స్నేహితులు కూడా ఉన్నారు.

(4 / 6)
అనంత్ అంబానీ - రాధికా మర్చంట్ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఈ ఏడాది ఫిబ్రవరిలో గుజరాత్‍లో గ్రాండ్‍గా జరిగింది. అయితే, ఇప్పుడు ఇటీలీ వేదికగా రెండోసారి ప్రీ-వెడ్డింగ్ సెలెబ్రేషన్లు జరుగుతున్నాయి. చాలా మంది సెలెబ్రెటీలు ఈ పార్టీకి హాజరయ్యారు. జాన్వీ కూడా వెళ్లారు. రెడ్, వైట్ కలర్ డ్రెస్‍లో ఈ సెలెబ్రేషన్లలో ఈ బ్యూటీ మెరిశారు.

(5 / 6)
బీచ్ ఒడ్డున ఉన్న హోటల్ బాల్కనీలో దిగిన ఈ అట్రాక్టివ్ ఫొటోను కూడా జాన్వీ కపూర్ పోస్ట్ చేశారు. అక్కడి ప్రకృతిని ఈ అందాల భామ ఆస్వాదించారు.

(6 / 6)
రాజ్‍కుమార్ రావ్‍తో కలిసి జాన్వీ కపూర్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ మహీ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఇక, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్‍లోకి జాన్వీ అడుగుపెడుతోంది.
ఇతర గ్యాలరీలు