తెలుగు న్యూస్ / ఫోటో /
Narendra Modi 3.0 Cabinet: ‘‘ఆలస్యం వద్దు..’’ - పదవీ బాధ్యతలు స్వీకరించిన కొత్త కేంద్ర మంత్రులు
- ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తమకు కేటాయించిన మంత్రిత్వ శాఖలకు పలువురు కేంద్ర కేబినెట్ మంత్రులు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. వారిలో విదేశాంగ మంత్రి జైశంకర్, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా తదితరులు ఉన్నారు.

(1 / 10)
ఢిల్లీలోని ఇందిరాగాంధీ ప్రవరన్ భవన్ లో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.(Arvind Yadav/HT Photo)
(2 / 10)
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ఢిల్లీలోని నిర్మాణ్ భవన్లో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. (Arvind/HT Photo)
(3 / 10)
మంగళవారం ఢిల్లీలోని శ్రమశక్తి భవన్ లో మనోహర్ లాల్ ఖట్టర్ విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.(Raj K Raj/HT Photo)
(4 / 10)
న్యూఢిల్లీలోని శాస్త్రి భవన్ లో సమాచార, ప్రసార శాఖ మంత్రిగా అశ్విని వైష్ణవ్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.(Raj K Raj/HT Photo)
(5 / 10)
కేంద్ర హోం మంత్రిగా, సహకార శాఖ మంత్రిగా అమిత్ షా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. (Sanjeev Verma/HT Photo)
(6 / 10)
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మంగళవారం ఢిల్లీలోని రైల్ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.
(Arvind Yadav/HT Photo)(7 / 10)
కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలరవాణా శాఖ మంత్రిగా సర్బానంద సోనోవాల్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
(Sarbananda Sonowal-X)(8 / 10)
మాజీ దౌత్యవేత్త ఎస్ జైశంకర్ వరుసగా రెండోసారి విదేశాంగ మంత్రిగా మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.(PTI)
(9 / 10)
జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం ఢిల్లీలోని సంచార్ భవన్ లో కమ్యూనికేషన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.(Raj K Raj/HT Photo)
ఇతర గ్యాలరీలు