KCR Meets His Teacher : జగిత్యాలలో తన గురువును పరామర్శించిన కేసీఆర్, శిష్యుణ్ణి చూసి సంబరపడిన మాస్టారు
- KCR Meets His Teacher : తన చిన్ననాటి గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంచానికే పరిమితమైన గురువు రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
- KCR Meets His Teacher : తన చిన్ననాటి గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. మంచానికే పరిమితమైన గురువు రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
(1 / 6)
తన గురువు రమణయ్య ఆశీస్సులు తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బస్సు యాత్రలో భాగంగా ఆదివారం రాత్రి జగిత్యాలలో బస చేసిన కేసీఆర్, సోమవారం నిజామాబాద్ కు బయలుదేరే ముందు తన చిన్న నాటి గురువు ప్రముఖ కవి జైశెట్టి రమణయ్య ఇంటికి వెళ్లారు.
(2 / 6)
మంచానికే పరిమితమైన గురువు రమణయ్య వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకున్నారు. వయోభారంతో అనారోగ్యంతో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
(3 / 6)
కేసీఆర్ ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో సిద్దిపేట జూనియర్ కాలేజీలో హిస్టరీ లెక్చరర్ గా ఆయన నేర్పిన పాఠాలు, నాటి జ్ఞాపకాలను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు.
ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా ఎదిగిన తన ప్రియ శిష్యుణ్ణి చూసిన గురువు రమణయ్య ఎంతగానో సంబరపడ్డారు. తెలంగాణ ప్రజల పట్ల ఆనాటి నుంచి కేసీఆర్ కు ఉన్న శ్రద్ధను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు.
(4 / 6)
సిద్దిపేట జిల్లా కావాలని 30 ఏండ్ల కిందనే కేసీఆర్ నాటి కేంద్ర మంత్రికి వినతిని అందించిన విషయాన్ని గురువు రమణయ్య గుర్తు చేశారు. ప్రజలను చైతన్యం చేసి ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత నీదేనని తన శిష్యుడు కేసీఆర్ ను కొనియాడారు. సాధించిన రాష్ట్రాన్ని అనతి కాలంలోనే అభివృద్ధి చేసి తెలంగాణ ఔన్నత్యాన్ని దేశంలో నిలిపావని మెచ్చుకున్నారు.
(5 / 6)
కష్టాలను నష్టాలను సుఖాలను బాధలను జయాలను అపజయాలను సమ స్థితిలో స్వీకరించడం కేసీఆర్ కు చిన్ననాటి నుంచీ అలవాటేనని అదే రమణయ్య మాస్టారు అన్నారు. కేసీఆర్ అదే స్థిత ప్రజ్ఞతను కొనసాగిస్తూ భవిష్యత్తులో విజయాలు సాధిస్తూ తెలంగాణ ప్రజల కన్నీళ్లు తుడవడానికి ముందుండాలని, తెలంగాణ ప్రజల సంక్షేమానికి ఇంకా చాలా చేయాల్సి ఉందని తన శిష్యుడు కేసీఆర్ కు రమణయ్య ఉద్భోదించారు.
ఇతర గ్యాలరీలు