PM Modi : బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం, తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోంది-ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు
- PM Modi At Jagtial Meeting : తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

(1 / 7)
జగిత్యాల విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రారంభంలో తెలుగులో మాట్లాడిన ప్రధాని మోదీ అందరినీ ఉత్సహపరించారు.
(2 / 7)
తెలంగాణ ప్రజలు లోక్ సభ ఎన్నికల్లో సరికొత్త చరిత్రను లిఖించబోతున్నారని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలో బీజేపీకి మద్దతు పెరిగిందన్నారు. మూడు రోజుల్లో తెలంగాణకు రావడం ఇది రెండోసారి అన్నారు.
(3 / 7)
రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ గ్రాఫ్ తగ్గుతోందని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమికి 400లకు పైగా సీట్లు రావడం ఖాయమన్నారు. తెలంగాణ.. ఆంగ్లేయులు, రజాకార్లతో పోరాడిన నేల అని గుర్తుచేశారు.
(4 / 7)
బీఆర్ఎస్ దోపిడీపై కాంగ్రెస్ మౌనం వహిస్తోందని ప్రధాని మోదీ ఆరోపించారు. తెలంగాణ డబ్బు దిల్లీ చేరుతోందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు.
ఇతర గ్యాలరీలు