తెలుగు న్యూస్ / ఫోటో /
Ys Jagan to Vinukonda: ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్,భద్రత కుదించారన్న వైసీపీ, ఎక్కువే ఇచ్చామంటున్న ఏపీ సిఎంఓ
- Ys Jagan to Vinukonda: వినుకొండలో వైసీపీ సానుభూతిపరుడి హత్య నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రోడ్డు మార్గంలో వినుకొండ పర్యటనకు వెళుతున్న వైఎస్ జగన్ భద్రత కుదించారని వైసీపీ ఆరోపించింది. జగన్‌కు కేటాయించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మరో ప్రైవేట్ వాహనంలో ప్రయాణించారు.

(3 / 5)
బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో ప్రైవేట్ వాహనంలో వైఎస్ జగన్ వినుకొండ బయల్దేరారు. మాజీ ముఖ్యమంత్రికి ఇచ్చే భద్రత కంటే ఎక్కువ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.
(4 / 5)
జాతీయ రహదారిపై వాహనం మారుతున్న క్రమంలో వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలకు అభివాదం చేస్తున్నవైఎస్ జగన్
(5 / 5)
మాజీ సిఎంలకు ఇచ్చే భద్రత కంటే ఎక్కువే జగన్‌కు ఇస్తున్నట్టు ఏపీ సిఎంఓ వర్గాలు చెబుతున్నాయి. జగన్ నివాసం వద్ద భద్రతా సిబ్బందిని తొలగించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో జగన్ భద్రత కుదించలేదని ప్రభుత్వ వాదనగా ఉంది. వైఎస్ జగన్ కు పాత బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇచ్చారని, రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వడంతో ఇబ్బందులు తలెత్తాయని వైసీపీ నేతలు ఆరోపించారు. దారిలో పలుమార్లు బుల్లెట్ ప్రూఫ్ వాహనం మొరాయించడంతో మధ్యలోనే బుల్లెట్ ప్రూఫ్ వాహనం నుంచి దిగిన జగన్, – మరో వాహనంలో వినుకొండ బయల్దేరి వెళ్లారు.
ఇతర గ్యాలరీలు