జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. ఆ మూవీలో శ్రీదేవి ఎంత అందంగా ఉందో చూశారా.. ఆరు స్టన్నింగ్ ఫొటోలు-jagadeka veerudu athiloka sundari re releasing on may 9th sridevi stunning photos from the movie ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. ఆ మూవీలో శ్రీదేవి ఎంత అందంగా ఉందో చూశారా.. ఆరు స్టన్నింగ్ ఫొటోలు

జగదేక వీరుడు అతిలోక సుందరి రీరిలీజ్.. ఆ మూవీలో శ్రీదేవి ఎంత అందంగా ఉందో చూశారా.. ఆరు స్టన్నింగ్ ఫొటోలు

Published May 08, 2025 07:39 PM IST Hari Prasad S
Published May 08, 2025 07:39 PM IST

చిరంజీవి, శ్రీదేవి నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి. సరిగ్గా 35 ఏళ్ల కిందట అంటే మే 9, 1990న రిలీజైంది. ఇప్పుడీ మూవీ శుక్రవారం (మే 9) రీరిలీజ్ కానున్న నేపథ్యంలో ఆ సినిమాలో శ్రీదేవికి చెందిన స్టన్నింగ్ ఫొటోలు ఇక్కడ చూడండి.

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో శ్రీదేవి అందానికి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

(1 / 6)

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఓ క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. ఇందులో శ్రీదేవి అందానికి ఫిదా కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు.

ఈ మూవీలో శ్రీదేవి ఓ దేవకన్యలా నటించింది. అతిలోక సుందరి అనే టైటిల్ కు తగినట్లుగా శ్రీదేవి అందం ప్రేక్షకుల మనసుల్లో అలా నిలిచిపోయింది.

(2 / 6)

ఈ మూవీలో శ్రీదేవి ఓ దేవకన్యలా నటించింది. అతిలోక సుందరి అనే టైటిల్ కు తగినట్లుగా శ్రీదేవి అందం ప్రేక్షకుల మనసుల్లో అలా నిలిచిపోయింది.

ఇంద్రజ పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది. అందం, అమాయకత్వం కలబోసిన ఈ పాత్ర ఆమె కెరీర్లోనూ ఓ మైలురాయిగా మిగిలింది.

(3 / 6)

ఇంద్రజ పాత్రలో శ్రీదేవి ఒదిగిపోయింది. అందం, అమాయకత్వం కలబోసిన ఈ పాత్ర ఆమె కెరీర్లోనూ ఓ మైలురాయిగా మిగిలింది.

చిరంజీవి నటన, శ్రీదేవి అందం, పాటలు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

(4 / 6)

చిరంజీవి నటన, శ్రీదేవి అందం, పాటలు ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో తనను మరో హీరో భర్తీ చేసేవాడేమో కానీ.. శ్రీదేవిని మించి మరో అతిలోక సుందరిని ఊహించుకోవడం అసాధ్యమని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పడం విశేషం.

(5 / 6)

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో తనను మరో హీరో భర్తీ చేసేవాడేమో కానీ.. శ్రీదేవిని మించి మరో అతిలోక సుందరిని ఊహించుకోవడం అసాధ్యమని ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్పడం విశేషం.

35 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రీరిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి.

(6 / 6)

35 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమాను రూ.2 కోట్ల బడ్జెట్ తో రూపొందించగా.. ఏకంగా రూ.15 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు రీరిలీజ్ కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏం చేస్తుందో చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

ఇతర గ్యాలరీలు