Jadeja Record: రికార్డుల జడ్డూ.. ఇంగ్లండ్ ను తిప్పేసే మాయావి.. 6000 పరుగులు.. 600 వికెట్లు
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా రికార్డుల వేటలో సాగుతున్నాడు. తాజాగా ఇంగ్లండ్, భారత్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్లో 6 వేల పరుగులు చేయడంతో పాటు 600 వికెట్ల రికార్డూ ఖాతాలో వేసుకున్నాడు.
(1 / 5)
ఇంగ్లండ్ బ్యాటర్లను పెవిలియన్ చేర్చడాన్ని ఎంజాయ్ చేసే జడేజా ఆ జట్టుపై ఆధిపత్యాన్ని మరోసారి ప్రదర్శించాడు. ఇంగ్లండ్, భారత్ మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర నమోదు చేశాడు.
(PTI)(2 / 5)
ఇంగ్లండ్ పై 27 వన్డేలు ఆడిన జడేజా 42 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో దిగ్గజ పేసర్ అండర్సన్ (31 మ్యాచ్ ల్లో 40 వికెట్లు) రికార్డును తిరగరాశాడు. మూడో స్థానంలో ఫ్లింటాఫ్ (35 వన్డేల్లో 37 వికెట్లు) ఉన్నాడు.
(PTI)(3 / 5)
భారత స్టార్ ఆల్ రౌండర్ జడేజా మరో రికార్డూ సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లు కలిపి 6000 పరుగులు చేయడంతో పాటు 600 వికెట్లు తీసిన రెండో భారత బౌలర్ గా నిలిచాడు. కపిల్ దేవ్ (9031 పరుగులు, 687 వికెట్లు) ముందున్నాడు.
(AP)(4 / 5)
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన అయిదో భారత బౌలర్ జడేజా. అనిల్ కుంబ్లే (953 వికెట్లు), రవిచంద్రన్ అశ్విన్ (765), హర్భజన్ సింగ్ (707), కపిల్ దేవ్ (687).. జడేజా కంటే ముందున్నారు.
(AFP)ఇతర గ్యాలరీలు