Jabardasth Anchor: షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా అన్నారు.. ఫోన్ పెట్టేయమన్నా.. జబర్దస్త్ యాంకర్ కామెంట్స్
- Jabardasth Anchor Siri Hanumanth About Shah Rukh Khan Jawan Offer: మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసిన సిరి హన్మంతు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ జవాన్ సినిమాలో నటించింది. అయితే, ముందుగా షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా అంటే తానిచ్చిన రియాక్షన్ చెప్పుకొచ్చింది సిరి హన్మంతు.
- Jabardasth Anchor Siri Hanumanth About Shah Rukh Khan Jawan Offer: మొన్నటివరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసిన సిరి హన్మంతు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ జవాన్ సినిమాలో నటించింది. అయితే, ముందుగా షారుక్ ఖాన్‌తో జవాన్ సినిమా అంటే తానిచ్చిన రియాక్షన్ చెప్పుకొచ్చింది సిరి హన్మంతు.
(1 / 7)
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5తో పాపులర్ అయిన సీరియల్ నటి సిరి హన్మంతు కాస్తా నెగెటివ్ పేరు కూడా తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లలో నటించిన సిరి అలరించింది.
(2 / 7)
అంతేకాకుండా ఏకంగా బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ హీరోగా చేసిన జవాన్ సినిమాలో ఒక పాత్రలో కనిపించి అందిరని షాక్‌కు గురి చేసింది సిరి హన్మంతు. మొన్నటి వరకు జబర్దస్త్ యాంకర్‌గా చేసిన సిరి తనకు జవాన్ ఆఫర్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చింది.
(3 / 7)
బిగ్ బాస్‌తో పేరు తెచ్చుకున్న యాంకర్ శివకు రీసెంట్‌గా సిరి హన్మంతు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూలో సిరి హన్మంతుకు జవాన్ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది అని శివ అడిగాడు. దాంతో తెగ నవ్వేసింది సిరి. "అప్పుడు నీకు ఇంటర్వ్యూ ఇవ్వలేదనేగా ఇప్పుడు అడుగుతున్నావ్" అని నవ్వేసింది సిరి.
(4 / 7)
"అదేలా వచ్చిందంటే.. వచ్చేసింది. నాకు కూడా తెలియదు. ఫస్ట్ నేను ప్రాంక్ కాల్ అనుకున్నాను. ఫస్ట్ ప్రొడక్షన్ టీమ్ నుంచి కాల్ వచ్చింది. వాళ్లు ముంబై నుంచి కాల్ చేశారు. హిందీ టీమ్ నుంచి కాల్ వచ్చింది. ఇలా షారుక్ ఖాన్ హీరో, డైరెక్టర్ అట్లీగారు అని చెబితే.. ఫోన్ పెట్టేయ్ అన్నా.." అని చెప్పిన సిరి హన్మంతు నవ్వింది.
(5 / 7)
దాంతో యాంకర్ శివ అవునా షాక్ అయ్యాడు. "అంటే, హలో హలో అని ఒక రెండు మూడు సార్లు అన్నాను. అలా అనేసరికి మనవాళ్లే ఎవరో క్లోజ్ ఫ్రెండ్స్ అలా ప్రాంక్ చేస్తున్నారేమో అనుకున్న ఫోన్ పెట్టేయ్ అన్నా" అని సిరి హన్మంతు నవ్వింది.
(6 / 7)
"బాలీవుడ్ మూవీ వాళ్లు.. షారుక్ ఖాన్ హీరో, డైరెక్టర్ అట్లీ.. మనల్నెందుకు చూస్తారు" అని యాంకర్ శివ అన్నాడు. "అలాగే అనుకుని ఫోన్ పెట్టేసా. మళ్లీ నాకు మెయిల్ చేశారు, మేసేజ్ చేశారు. నేను రెస్పాండ్ అవ్వలేదు. ఎవరో కావాలనే చేస్తున్నారు అనుకున్నాను. ఇలాగే ఒకసారి నాకు ప్రాంక్ జరిగింది. అందుకే ఇది కూడా అలాగే అనుకున్నాను" అని అలా అనడానికి గల కారణం చెప్పింది బిగ్ బాస్ సిరి హన్మంతు.
(7 / 7)
ఇదిలా ఉంటే, మొదట్లో, సిరి హన్మంత్ రిపోర్టర్‌గా ఓ యూట్యూబ్ చానెల్‌లో పని చేసింది. ఆ తర్వాత కొన్ని న్యూస్ ఛానెళ్లలో సైతం న్యూస్ రీడర్‌గా చేసింది. అలా ఫేమస్ అయిన సిరి హన్మంతు అనంతరం బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే 'ఎవరే నువ్వు మోహినీ', 'సావిత్రమ్మ గారి అబ్బాయి', 'అగ్ని సాక్షి' వంటి సీరియళ్లలో నటించింది. అలా ఫుల్ పాపులర్ అయింది.
ఇతర గ్యాలరీలు