J and K assembly polls: జమ్ముకశ్మీర్ లో ప్రశాంతంగా ముగిసిన తొలి దశ పోలింగ్; భారీగా తరలివచ్చిన ఓటర్లు
- జమ్ముకశ్మీర్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో జమ్మూ ప్రాంతంలో 8, కశ్మీర్ లోయలో 16 స్థానాలు ఉన్నాయి. ఓటు వేయడానికి రెండు ప్రాంతాల ప్రజలు భారీగా తరలి రావడం విశేషం.
- జమ్ముకశ్మీర్ లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాలకు గాను 24 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇందులో జమ్మూ ప్రాంతంలో 8, కశ్మీర్ లోయలో 16 స్థానాలు ఉన్నాయి. ఓటు వేయడానికి రెండు ప్రాంతాల ప్రజలు భారీగా తరలి రావడం విశేషం.
(1 / 11)
మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్లోని కుల్గామ్ లోని పోలింగ్ కేంద్రం ముందు ఓటర్లు క్యూ కట్టారు. సాయంత్రం 5 గంటల సమయానికి 58.19 శాతం పోలింగ్ నమోదైంది.(Waseem Andrabi/HT Photo)
(2 / 11)
ఓటరు గుర్తింపు సమస్యలపై నిరసన కారణంగా కిష్త్వార్లోని బాగ్వాన్ మొహల్లాలోని పోలింగ్ కేంద్రంలో కొద్దిసేపు పోలింగ్ ను నిలిపివేసినప్పటికీ కొద్దిసేపటికే తిరిగి ప్రారంభించారు.(Waseem Andrabi/HT Photo)
(3 / 11)
కుల్గాంలో ఓటు వేసేందుకు మహిళలు తమ పిల్లలతో క్యూలో నిరీక్షించారు. మూడు అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లాలో సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా డీహెచ్ పోరాలో 65.21 శాతం పోలింగ్ నమోదైంది.(Waseem Andrabi/HT Photo)
(4 / 11)
పొడవైన క్యూలు కనిపించడంతో అధిక పోలింగ్ నమోదవుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. 90 మంది ఇండిపెండెంట్లతో సహా 219 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల బరిలో ఉన్నారు. ఇక్కడ మొత్తం 23 లక్షలకు పైగా ఓటర్లున్నారు.(Waseem Andrabi/HT Photo)
(5 / 11)
జమ్మూ ప్రాంతంలోని ఇందర్వాల్లో సాయంత్రం 5 గంటల సమయానికి 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధికంగా 80.06 శాతం పోలింగ్ నమోదైంది.(Waseem Andrabi/HT Photo)
(6 / 11)
జమ్మూకశ్మీర్లో సెప్టెంబర్ 25న రెండో దశ, అక్టోబర్ 1న మూడో దశ పోలింగ్ జరగనుంది.(Waseem Andrabi/HT Photo)
(7 / 11)
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ కోసం కశ్మీరీ వలసదారులు ఢిల్లీలోని ప్రత్యేక పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.(PTI)
(8 / 11)
కిష్త్వార్లో సాయంత్రం 5 గంటల సమయానికి అత్యధికంగా 77.23 శాతం పోలింగ్ నమోదైంది. పుల్వామాలో అత్యల్పంగా 43.87 శాతం పోలింగ్ నమోదైంది.(PTI)
(9 / 11)
జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ అనంతరం అనంతనాగ్ జిల్లాలో ఓటర్లు తమ సిరా గుర్తు వేళ్లను చూపించారు.(PTI)
(10 / 11)
తొలి దశ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అనంత్ నాగ్ లో ఓటు వేసిన తర్వాత ఓ వృద్ధ ఓటరు తన మనవరాలి సాయంతో తన సిరా గుర్తు వేలిని చూపించారు.(PTI)
ఇతర గ్యాలరీలు