(1 / 6)
ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఐటీఆర్ లో ఈ ఐదు హెడ్స్ కింద ఇన్ కం ను చూపాలి.
(2 / 6)
వేతనం ద్వారా లభించే ఆదాయం: వేతనం ద్వారా లభించే ఆదాయంలో జీత భత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ, యాన్యుటీ, లీవ్ ఎన్ క్యాష్ మెంట్, ప్రావిడెండ్ ఫండ్ నుంచి ట్రాన్స్ ఫర్ చేసిన మొత్తం.. మొదలైనవి వస్తాయి.
(3 / 6)
ఇంటి ఆస్తి పై లభించే ఆదాయం: తను ఉంటున్న ఇల్లు కాకుండా, వేరే సొంత ఇంటిపై లభించే అద్దె ను ఈ కేటగిరీలో చూపాలి. ఒకవేళ ఆ ఇల్లు ఖాళీగా ఉంటే నోషనల్ ఇన్ కమ్ ను చూపాలి.
(4 / 6)
వృత్తి, వ్యాపారాల ద్వారా లభించే ఆదాయం: వృత్తి లేదా వ్యాపారం ద్వారా లభించే ఆదాయాన్ని ఈ కేటగిరీలో చూపాలి. ఈ వృత్తి, లేదా వ్యాపారానికి సంబంధించిన వడ్డీ, వేతనం, సంస్థ యజమాని లేదా భాగస్వామిగా లభించే బోనస్ వంటివి ఈ కేటగిరీలోకి వస్తాయి.
(Photo via Pixabay)(5 / 6)
క్యాపిటల్ గెయిన్స్ ద్వారా లభించే ఆదాయం కేటగిరీలో ఏదైనా స్థిర, చరాస్తులను అమ్మడం ద్వారా లభించే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఉంటాయి.
(6 / 6)
ఇతర మార్గాల ద్వారా లభించే ఆదాయం కేటగిరీలో బ్యాంక్ డిపాజిట్లు, సెక్యూరిటీలు, డివిడెండ్లు, రాయల్టీ, లాటరీలు, రేసులు, బహుమతుల వంటి వాటి ద్వారా లభించే ఆదాయం మొదలైనవి ఉంటాయి.
ఇతర గ్యాలరీలు