తెలుగు న్యూస్ / ఫోటో /
Gaganyaan : రెండో ప్రయత్నంలో గగన్‌యాన్ తొలి ‘టెస్ట్’ సక్సెస్!
- ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లో కీలక ఘట్టం. మిషన్‌కు సంబంధించిన తొలి 'టెస్ట్'ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించింది ఇస్రో.
- ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్‌లో కీలక ఘట్టం. మిషన్‌కు సంబంధించిన తొలి 'టెస్ట్'ను శ్రీహరికోట నుంచి విజయవంతంగా నిర్వహించింది ఇస్రో.
(1 / 5)
తొలుత ఈ పరీక్ష శనివారం ఉదయం 8 గంటలకు నిర్వహించాల్సి ఉంది. కాగా సిస్టెమ్లో లోపం కారణంగా వాయిదా పడింది. లోపాన్ని సరిచేసిన అనంతరం.. రెండో ప్రయత్నంగా ఉదయం 10 గంటలకు పరీక్ష నిర్వహించింది ఇస్రో.(HT_PRINT)
(2 / 5)
ఈ పరీక్ష పేరు టీవీ-డీ1 ఫ్లైట్ టెస్ట్ (టెస్ట్ వెహికిల్ డెవలప్మెంట్ ఫ్లైట్ మిషన్) ఫ్లైట్. అనుకోని సమస్య ఏదైనా ఎదురైతే.. రాకెట్లో నుంచి వ్యోమగాముల బృందం సురక్షితంగా బయటపడగలదా? లేదా? అన్నది తెలుసుకునేందుకు ఈ క్రూ ఎస్కేప్ మిషన్ ప్రయోగం ఉపయోగపడుతుంది. తాజా ప్రయోగం సక్సెస్ అయ్యింది.(PTI)
(3 / 5)
"టీవీ-డీ1 మిషన్ సక్సెస్ అని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. క్రూ మాడ్యూల్‌ని వెహికిల్ నుంచి క్రూ ఎస్కేప్ సిస్టెమ్ వేరు చేసింది. ఆ తర్వాత సముద్రంలో చేపట్టిన టచ్ డౌన్ కూడా పూర్తిగా సక్సెస్ అయ్యింది," అని ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు.(PTI)
(4 / 5)
ఇస్రో.. ఇప్పటివరకు మనుషులను అంతరిక్షంలోకి పంపించలేదు. గగన్‌యాన్‌తో ఈ బాధ్యతను సమర్థవంతంగా పూర్తిచేయాలని భావిస్తోంది. ఇది సక్సెస్ అయితే.. అమెరికా, రష్యా, చైనా తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.(PTI)
ఇతర గ్యాలరీలు