ఫోన్ పాతదైపోయిందా? కొత్తది కొంటున్నారా? వెయిట్.. ఇలా చేస్తే చాలు.. కొత్తదైపోతుంది!-is your smartphone become old use these tricks to make it look like a new phone ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఫోన్ పాతదైపోయిందా? కొత్తది కొంటున్నారా? వెయిట్.. ఇలా చేస్తే చాలు.. కొత్తదైపోతుంది!

ఫోన్ పాతదైపోయిందా? కొత్తది కొంటున్నారా? వెయిట్.. ఇలా చేస్తే చాలు.. కొత్తదైపోతుంది!

Published Apr 19, 2025 09:32 PM IST Sudarshan V
Published Apr 19, 2025 09:32 PM IST

మీ ఫోన్ పాతదైపోయిందా? స్పీడ్ తగ్గిందా? తరచూ హ్యాంగ్ అవుతోందా? లుక్ కూడా పాతగా మారిందా?.. కొత్తది కొనక తప్పదు అనుకుంటున్నారా? వెయిట్.. ఈ సింపుల్ ట్రిక్స్ తో మీ పాత ఫోన్ ను మళ్లీ కొత్తగా చేసుకోండి.

ఫోన్ వయసు పెరిగే కొద్దీ అది క్రమంగా స్లో అవుతుంది, బ్యాటరీ వేగంగా అయిపోతుంది, యాప్స్ క్రాష్ అవ్వడం మొదలవుతుంది. దాంతో కొత్త ఫోన్ కొనాలనే ఆలోచన ప్రారంభమవుతుంది. అయితే, ఈ సింపుల్ ట్రిక్స్ తో మీరు కొత్తది కొనకుండానే మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఫ్రెష్ గా మార్చుకోవచ్చు.

(1 / 7)

ఫోన్ వయసు పెరిగే కొద్దీ అది క్రమంగా స్లో అవుతుంది,
బ్యాటరీ వేగంగా అయిపోతుంది, యాప్స్ క్రాష్ అవ్వడం మొదలవుతుంది. దాంతో కొత్త ఫోన్ కొనాలనే ఆలోచన ప్రారంభమవుతుంది. అయితే, ఈ సింపుల్ ట్రిక్స్ తో మీరు కొత్తది కొనకుండానే మీ పాత స్మార్ట్ ఫోన్ ను ఫ్రెష్ గా మార్చుకోవచ్చు.

మీ ఫోన్ ని క్లీన్ చేసి అప్ డేట్ చేసుకోండి. మనం చాలా ఏళ్లుగా ఉపయోగించని అప్లికేషన్ లతో మన ఫోన్ లను నింపుతాం. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఫోన్ వేగాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల మీ స్మార్ట్ ఫోన్ నుండి అన్ని అవాంఛిత యాప్ లు, అనవసర ఫోటోలు, పేరుకుపోయిన ఫైల్స్ ను తొలగించాలి. దీని తరువాత దానిని తాజా వెర్షన్ కు అప్ డేట్ చేయాలి.

(2 / 7)

మీ ఫోన్ ని క్లీన్ చేసి అప్ డేట్ చేసుకోండి.
మనం చాలా ఏళ్లుగా ఉపయోగించని అప్లికేషన్ లతో మన ఫోన్ లను నింపుతాం. ఈ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో రన్ అవుతూ ఫోన్ వేగాన్ని బాగా తగ్గిస్తాయి. అందువల్ల మీ స్మార్ట్ ఫోన్ నుండి అన్ని అవాంఛిత యాప్ లు, అనవసర ఫోటోలు, పేరుకుపోయిన ఫైల్స్ ను తొలగించాలి. దీని తరువాత దానిని తాజా వెర్షన్ కు అప్ డేట్ చేయాలి.

ఫోన్ డిస్ ప్లే వాల్ పేపర్ ను రిఫ్రెష్ చేయండికొత్త ఐకాన్ ప్యాక్ లు, వాల్ పేపర్స్, కస్టమ్ లాంచర్లను ఉపయోగించి మీరు మీ ఫోన్ కు పూర్తిగా కొత్త లుక్ ఇవ్వవచ్చు.నోవా లాంచర్, మైక్రోసాఫ్ట్ లాంచర్ వంటి ఆప్షన్ లు మీకు విజువల్ చేంజ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.అనవసరమైన విడ్జెట్ లు, యానిమేషన్ లను తొలగించడం ద్వారా, మీరు బ్యాటరీ వాడకాన్ని తగ్గించవచ్చు. మీ ఫోన్ వేగాన్ని పెంచవచ్చు.

(3 / 7)

ఫోన్ డిస్ ప్లే వాల్ పేపర్ ను రిఫ్రెష్ చేయండి

కొత్త ఐకాన్ ప్యాక్ లు, వాల్ పేపర్స్, కస్టమ్ లాంచర్లను ఉపయోగించి మీరు మీ ఫోన్ కు పూర్తిగా కొత్త లుక్ ఇవ్వవచ్చు.నోవా లాంచర్, మైక్రోసాఫ్ట్ లాంచర్ వంటి ఆప్షన్ లు మీకు విజువల్ చేంజ్ అనుభవాన్ని ఇవ్వడమే కాకుండా పనితీరును కూడా మెరుగుపరుస్తాయి.అనవసరమైన విడ్జెట్ లు, యానిమేషన్ లను తొలగించడం ద్వారా, మీరు బ్యాటరీ వాడకాన్ని తగ్గించవచ్చు. మీ ఫోన్ వేగాన్ని పెంచవచ్చు.

బ్యాటరీ లైఫ్ ను మెరుగుపరచండి- మీ ప్రస్తుత ఫోన్ బ్యాటరీ సెట్టింగ్ లకు వెళ్లి ఏ అప్లికేషన్ లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో చెక్ చేయండి. అవసరం లేకపోతే, అటువంటి అప్లికేషన్ లను డిలీట్ చేయండి లేదా 'బ్యాటరీ సేవర్' మోడ్ లో ఉంచండి. అవసరమనుకుంటే మీరు బ్యాటరీని కూడా రీప్లేస్ చేయవచ్చు.

(4 / 7)

బ్యాటరీ లైఫ్ ను మెరుగుపరచండి-
మీ ప్రస్తుత ఫోన్ బ్యాటరీ సెట్టింగ్ లకు వెళ్లి ఏ అప్లికేషన్ లు ఎక్కువ బ్యాటరీని ఉపయోగిస్తున్నాయో చెక్ చేయండి. అవసరం లేకపోతే, అటువంటి అప్లికేషన్ లను డిలీట్ చేయండి లేదా 'బ్యాటరీ సేవర్' మోడ్ లో ఉంచండి. అవసరమనుకుంటే మీరు బ్యాటరీని కూడా రీప్లేస్ చేయవచ్చు.

ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ మీ ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతున్నట్లయితే, లేదా అప్లికేషన్ లు క్రాష్ అవుతున్నట్లయితే మీరు ఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. కానీ, గుర్తుంచుకోండి, ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే, అందులోని ఫోటోలు, వీడియోలు,, కాంటాక్ట్స్ వంటి మీ పర్సనల్ డేటా అంతా డిలీట్ అవుతుంది. అందువల్ల అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. ఫ్యాక్టరీ రీసెట్ తరువాత మీరు దానిని మొదట కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందో అలా మారుతుంది.

(5 / 7)

ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్

మీ ఫోన్ పదేపదే హ్యాంగ్ అవుతున్నట్లయితే, లేదా అప్లికేషన్ లు క్రాష్ అవుతున్నట్లయితే మీరు ఫోన్ ని ఫ్యాక్టరీ రీసెట్ చేయవచ్చు. కానీ, గుర్తుంచుకోండి, ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే, అందులోని ఫోటోలు, వీడియోలు,, కాంటాక్ట్స్ వంటి మీ పర్సనల్ డేటా అంతా డిలీట్ అవుతుంది. అందువల్ల అవసరమైన డేటాను బ్యాకప్ తీసుకోండి. ఫ్యాక్టరీ రీసెట్ తరువాత మీరు దానిని మొదట కొనుగోలు చేసినప్పుడు ఎలా ఉందో అలా మారుతుంది.

యాక్ససరీని అప్ డేట్ చేయండిపాత యాక్ససరీలను రీప్లేస్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ ను కొత్తగా కనిపించేలా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక మంచి కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లేదా మొబైల్ స్టాండ్ మీ ఫోన్ లుక్ ను కొంత మారుస్తాయి.

(6 / 7)

యాక్ససరీని అప్ డేట్ చేయండి

పాత యాక్ససరీలను రీప్లేస్ చేయడం ద్వారా మీరు మీ ఫోన్ ను కొత్తగా కనిపించేలా చేయవచ్చు. ఉదాహరణకు, ఒక మంచి కేస్, స్క్రీన్ ప్రొటెక్టర్, బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ లేదా మొబైల్ స్టాండ్ మీ ఫోన్ లుక్ ను కొంత మారుస్తాయి.

క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించండిమీ ఫోన్ స్టోరేజ్ తక్కువగా ఉండి, మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించవచ్చు. గూగుల్ ఫోటోస్, వన్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి సేవలు ఫోటోలు, ఫైళ్లను ఆన్లైన్లో సేవ్ చేయడానికి ఉపయోగించవచ్చు. తద్వారా, మీ ఫోన్ లో స్టోరేజ్ ను క్లియర్ చేయవచ్చు. దాంతో కూడా మీ ఫోన్ వేగవంతం అవుతుంది.

(7 / 7)

క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించండి

మీ ఫోన్ స్టోరేజ్ తక్కువగా ఉండి, మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే, మీరు క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించవచ్చు. గూగుల్ ఫోటోస్, వన్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ వంటి సేవలు ఫోటోలు, ఫైళ్లను ఆన్లైన్లో సేవ్ చేయడానికి ఉపయోగించవచ్చు. తద్వారా, మీ ఫోన్ లో స్టోరేజ్ ను క్లియర్ చేయవచ్చు. దాంతో కూడా మీ ఫోన్ వేగవంతం అవుతుంది.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

ఇతర గ్యాలరీలు