తెలుగు న్యూస్ / ఫోటో /
Child Insurance: పిల్లల పేరిట ఇన్సూరెన్స్ పాలసీలు, స్థిరాస్తుల కొనుగోలు సురక్షితమేనా?
- Child Insurance: ఏ పొదుపు పథకమైనా, పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతో చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతార. అనవసరమైన భావోద్వేగాలకు లొంగి కష్టాలు కొని తెచ్చుకోకూడదని, తల్లిదండ్రులకు సరైన బీమా పాలసీ ఉన్న తర్వాతే పిల్లల పేరుతో పాలసీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
- Child Insurance: ఏ పొదుపు పథకమైనా, పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతో చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతార. అనవసరమైన భావోద్వేగాలకు లొంగి కష్టాలు కొని తెచ్చుకోకూడదని, తల్లిదండ్రులకు సరైన బీమా పాలసీ ఉన్న తర్వాతే పిల్లల పేరుతో పాలసీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
(1 / 12)
పిల్లల పేరుతో పాలసీ ఇచ్చినా వారి జీవితానికి బీమా కవరేజ్ మాత్రం వారికి ఏడేళ్లు నిండితే గాని ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడే పుట్టిన బిడ్డక్కూడా బీమా పాలసీ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు.
(2 / 12)
పిల్లల పేరుతో పాలసీ ఉంటే తల్లిదండ్రులకు ఏదైనా ప్రమాదం జరిగితే వారి జీవితాలకు సరైన భద్రత ఉండదు. పిల్లలు చదువుకునే స్థితికొచ్చేసరికి బీమా సొమ్ము ఆసరాగా నిలిచినా అప్పటి వరకు మిగిలిన కుటుంబానికి ఇల్లు గడిచే వెసులుబాటు ఉండదు. ఆదాయానికి, వయసుకి తగిన బీమా కవరేజ్ ఉన్నప్పుడు సరైన పాలసీలు తీసుకోవడం మంచిది.
(3 / 12)
ఏ పొదుపు పథకమైనా, పాలసీ అయినా పిల్లల కోసం చేయొచ్చు కానీ, పిల్లల పేరుతో చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక నిపుణులు చెబుతార. అనవసరమైన భావోద్వేగాలకు లొంగి కష్టాలు కొని తెచ్చుకోకూడదని, తల్లిదండ్రులకు సరైన బీమా పాలసీ ఉన్న తర్వాతే పిల్లల పేరుతో పాలసీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
(4 / 12)
పిల్లల పేరుతో పాలసీ చేయాలనిపిస్తే తల్లిదండ్రులకి బీమా కవరేజి ఇచ్చే పిల్లల పాలసీలని చేయవచ్చు.
(5 / 12)
తల్లిదండ్రులు తమకేమైనా అయినా పిల్లలకి ఆర్థిక సహకారం అందాలని ఆశించి పాలసీ చేయడం మంచిది. తమ చిన్నారులకేమైనా అయితే ఆ దురదృష్టం ద్వారా తమకు డబ్బు రావాలనీ ఏ తల్లీ, తండ్రీ ఆశించరు. తల్లిదండ్రులకు సరైన భద్రత లేకుండా పిల్లల పేరిట పాలసీలు సురక్షితమైన పెట్టుబడి అనిపించుకోవు.
(6 / 12)
కాస్త రిస్క్‌కు సిద్ధపడితే నెలనెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్లో చెల్లిస్తూ పోతే, దీర్ఘకాలానంతరం పిల్లల అవసరాలకు ఉపయోగపడే మంచి ఫండ్ మొత్తాన్ని ఏర్పరుచుకోవచ్చు.
(7 / 12)
పిల్లల భవిష్యత్తు కోసం 8 శాతం వడ్డీ వచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్లో డిపాజిట్ చేస్తే ఎండోమెంట్ పాలసీల్లో గిట్టుబాటయ్యే వడ్డీ కంటే ఎక్కువ వడ్డీయే గిట్టుబాటవుతుంది.
(8 / 12)
తల్లి/తండ్రికి ప్రాణానికి ఏమన్నా జరిగితే పాలసీ మొత్తాన్ని వెంటనే చెల్లించి, పిల్లలకి యుక్తవయసు వచ్చిన తర్వాత మెచ్యూరిటీ మొత్తాన్ని మళ్ళీ చెల్లించే పాలసీలు ఉన్నాయి. వాటిని తీసుకోవడం మంచిదే.
(9 / 12)
బీమా పాలసీ దీర్ఘకాలిక కాంట్రాక్టు. ఒక్కసారి పిల్లల పేరుతో పాలసీ తీసుకొని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందుల వల్ల కట్టలేకపోతే సరెండర్ చార్జీల క్రింద కొంత మొత్తాన్ని కోల్పోవలసి వస్తుంది.పొదుపు పథకాలలో ఈ ఇబ్బంది ఉండదు.
(10 / 12)
పిల్లల పేరుతో పాలసీ ఎందుకు? జీవిత బీమా సంస్థలు పిల్లల పేరుతో పాలసీ ఇచ్చినా వారి జీవితానికి బీమా కవరేజ్ మాత్రం వారికి ఏడేళ్లు నిండితే గాని ఇవ్వడం లేదు. ఇలాంటి పరిస్థితిలో అప్పుడే పుట్టిన బిడ్డక్కూడా బీమా పాలసీ తీసుకోవడం వల్ల ఉపయోగం లేదు.
(11 / 12)
ముప్పయ్యేళ్ళ జంటకు కూతురు పుట్టగానే బీమా ఏజంటు మాటలతొ కూతురు పేరుతో బీమాపాలసీ తీసుకున్నాడు. పాప పుట్టిన రెండో ఏట ఓ దుర్ఘటనలో తండ్రి మృత్యువాత పడ్డాడు.ఆ వ్యక్తి చనిపోయే సమయానికి అతని పేరుతో ఒక్క పాలసీ కూడా లేకపోవడంతో తల్లీ బిడ్డలకి రోజు గడవడం కష్టమయింది. పిల్లల కంటే తల్లిదండ్రుల పేరిట పాలసీలు తీసుకోవడం ఉత్తమం.
ఇతర గ్యాలరీలు