IRCTC Vizag Retreat Tour : సింహాచలం, అరకు టూర్.. ఈ కొత్త ప్యాకేజీ చూడండి-irctc toursim simhachalam and arakku tour from visakhapatnam city ,ఫోటో న్యూస్
Telugu News  /  Photo Gallery  /  Irctc Toursim Simhachalam And Arakku Tour From Visakhapatnam City

IRCTC Vizag Retreat Tour : సింహాచలం, అరకు టూర్.. ఈ కొత్త ప్యాకేజీ చూడండి

Nov 19, 2023, 09:50 AM IST Maheshwaram Mahendra Chary
Nov 19, 2023, 09:50 AM , IST

  • IRCTC Simhachalam and Arakku Tour: 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఐఆర్‌సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ వివరాలు ఇక్కడ చూడండి……

కొత్త ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇక  అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.

(1 / 5)

కొత్త ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇక  అరకు వెళ్లాలనుకునే వారికి సరికొత్త ప్యాకేజీ ఇస్తోంది. 'వైజాగ్ రీట్రీట్' పేరుతో ఈ ప్యాకేజీని అందిస్తోంది. ఇందులో విశాఖ, అరకు, సింహాచలం వంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.(unsplash.com/)

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ప్రతిరోజు  అందుబాటులో ఉంది. 

(2 / 5)

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ ప్రతిరోజు  అందుబాటులో ఉంది. (unsplash.com/)

Day - 01 : మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.

(3 / 5)

Day - 01 : మొదటి రోజు ఉదయం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ నుంచి టూరిస్టులను పికప్ చేసుకొని హోటల్‌కు తీసుకెళ్తారు. అల్పహారం తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిం స్టూడియో, ఫిషింగ్ హార్బర్ లాంటి టూరిస్ట్ స్పాట్స్‌కి తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలోనే బస చేయాలి.(unsplash.com/)

రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. ఇక మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.

(4 / 5)

రెండో రోజు ఉదయం 8 గంటలకు అరకు బయల్దేరాలి. దారిలో పద్మపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహలను సందర్శించిన తర్వాత రాత్రికి విశాఖపట్నం చేరుకుంటారు. ఇక మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత సింహాచలం హాఫ్ డే టూర్ ఉంటుంది. ఆ తర్వాత విశాఖపట్నం తిరిగి రావాలి. టూరిస్టులు ఎయిర్‌పోర్ట్, రైల్వేస్టేషన్, బస్‌స్టాండ్ దగ్గర దిగొచ్చు. దీంతో ప్యాకేజీ ముగుస్తుంది.(unsplash.com/)

ఈ టూర్ ప్యాకేజీ ధరలను చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో  ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8805, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11340, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.20190గా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

(5 / 5)

ఈ టూర్ ప్యాకేజీ ధరలను చూస్తే…. కంఫర్ట్ క్లాస్ లో  ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.8805, డబుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11340, సింగిల్ ఆక్యుపెన్సీ ధర రూ.20190గా నిర్ణయించారు. 5 - 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.(unsplash.com/)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు