IRCTC Shirdi Tour 2025: విజయవాడ టు షిర్డీ - తగ్గిన టికెట్ ధరలు..! ఈ కొత్త ప్యాకేజీ చూడండి
- IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వచ్చే ఫిబ్రవరి నెలలో అందుబాటులో ఉంది. ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
- IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వచ్చే ఫిబ్రవరి నెలలో అందుబాటులో ఉంది. ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ వివరాలను ఇక్కడ తెలుసుకోండి…
(1 / 8)
ఈ కొత్త సంవత్సరంలో షిర్డీ సాయి బాబాను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. విజయవాడ నుంచి ఈ ట్రిప్ అందుబాటులో ఉంటుంది.
(image source @SSSTShirdi)(2 / 8)
ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని 4 ఫిబ్రవరి, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
(image source @SSSTShirdi)(3 / 8)
ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ఇది మొత్తం 4 రోజుల టూర్ ప్యాకేజీ. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు.
(4 / 8)
ఈ ప్యాకేజీ బుక్ చేసుకునే వారు కేవలం విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.
(5 / 8)
మొదటి విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.
(6 / 8)
3వ రోజు మార్నింగ్ శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.29 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(7 / 8)
విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16150గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8520 చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6180గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 7760, డబుల్ షేరింగ్ కు రూ. 7760గా ఉంది. గత నెల డిసెంబర్ ధరలతో పోల్చితే… ప్రస్తుత ప్యాకేజీలో వెయ్యి రూపాయల(3ఏసీ -సింగిల్ ఆక్యుపెన్సీలో) మేరకు తగ్గింది. డబుల్ ఆక్యుపెన్సీ, ట్రిపుల్ ఆక్యుపెన్సీలో కూడా స్వల్ప మార్పులు ఉన్నాయి.
(8 / 8)
విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076
(image source @SSSTShirdi)ఇతర గ్యాలరీలు