Coastal Tamilnadu Tour 2025 : పాండిచ్చేరి, మహాబలిపురం ట్రిప్ - హైదరాబాద్ నుంచి సరికొత్త టూర్ ప్యాకేజీ, ఇవిగో వివరాలు
- IRCTC Hyderabad Coastal Tamilnadu Tour 2025 : హైదరాబాద్ నుంచి ఐఆర్ సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడు తీర ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేసులను కవర్ చేసేలా ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. ఇందులో భాగంగా మహాబలిపురం, పుదిచ్చేరితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొ్చు. మార్చిలో జర్నీ ఉంటుంది.
- IRCTC Hyderabad Coastal Tamilnadu Tour 2025 : హైదరాబాద్ నుంచి ఐఆర్ సీటీసీ టూరిజం మరో కొత్త ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడు తీర ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేసులను కవర్ చేసేలా ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. ఇందులో భాగంగా మహాబలిపురం, పుదిచ్చేరితో పాటు మరికొన్ని ప్రాంతాలను చూడొ్చు. మార్చిలో జర్నీ ఉంటుంది.
(1 / 8)
సమ్మర్ ఎంట్రీ ఇస్తున్న వేళ ఐఆర్ సీటీసీ టూరిజం సరికొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. ఇందులో అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు మరికొన్న ఆహ్లాదకరమైన ప్రాంతాలు కూడా ఉంటున్నాయి.
(image source irctc tourism, com)(2 / 8)
తాజాగా హైదరాబాద్ నుంచి IRCTC టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. తమిళనాడు తీర ప్రాంతంలోని టూరిస్ట్ ప్లేస్ లను చూసేలా ఈ ట్రిప్ ను ఆపరేట్ చేయనుంది. మొత్తం 5 రోజులు ఉంటుంది.
(image source istockphoto.com)(3 / 8)
"COASTAL CHARM OF TAMIL NADU" పేరుతో ఆపరేట్ చేస్తున్న ఈ ప్యాకేజీ ప్రస్తుతం ఈ మార్చి 06, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈలోపే టూరిస్టులు టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా వెళ్లాల్సి ఉంటుంది.
(image source istockphoto.com)(4 / 8)
తొలి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం 5 గంటలకు బయల్జేరుతారు. రాత్రంతా జర్నీ ఉంటుంది. రెండో రోజు ఉదయం 11 గంటల వరకు పుదిచ్చేరి స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. Auroville అరబింద్ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ప్యారడైజ్ బీచ్ కు కూడా వెళ్తారు. రాత్రి పుదిచ్చేరిలోనే ఉంటారు.
(image source istockphoto.com)(5 / 8)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత చిదంబరం వెళ్తారు. నటరాజ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం పిచ్చవరం మ్యాంగ్రూవ్స్ చూస్తారు. అక్కడ్నుంచి పుదిచ్చేరికి చేరుకుంటారు. రాత్రి ఇక్కడే బస చేస్తారు.
(6 / 8)
నాల్గో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. నేరుగా మహాబలిపురంకు వెళ్తారు. స్థానికంగా ఉన్న ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత చెంగల్ పట్టు స్టేషన్ కు చేరుకుంటారు. మధ్యాహ్నం 03. 30 గంటలకు రిటర్న్ జర్నీ స్టార్ అవుతుంది. మరునాడు ఉదయం 07. 50 గంటలకు కాచిగూడ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(7 / 8)
టూర్ ప్యాకేజీ ధరలు చూస్తే కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 30080, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 17460, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 14180గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 12030, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 15300గా ఉంది.
(image source istock .com)(8 / 8)
ఈ లింక్ పై క్లిక్ చేసి హైదరాబాద్ - తమిళనాడు టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 9281030734 / 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.
(image source istock .com)ఇతర గ్యాలరీలు