IRCTC Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్-irctc tourism to operate vijayawada shirdi tour package in december 2024 complete details read here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్

IRCTC Shirdi Tour : ఒకే ప్యాకేజీలో షిర్డీ, శనిశిగ్నాపూర్ దర్శనం - విజయవాడ నుంచి టూర్ ప్యాకేజీ, డిసెంబర్ నెలలో ట్రిప్

Nov 30, 2024, 01:43 PM IST Maheshwaram Mahendra Chary
Nov 30, 2024, 01:30 PM , IST

  • IRCTC Vijayawada Shirdi Tour: విజయవాడ నుంచి షిర్డీకి టూర్ ప్యాకేజీ వచ్చేసింది. వచ్చే డిసెంబర్ నెలలో అందుబాటులో ఉంది. ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్  కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ పూర్తి వివరాలను ఇక్కడ చూడండి….

వచ్చే డిసెంబర్ నెలలో ఏదైనా అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? అయితే మీలాంటి వారి కోసం ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా షిర్డీకి తాజాగా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. 

(1 / 7)

వచ్చే డిసెంబర్ నెలలో ఏదైనా అధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవాలని అనుకుంటున్నారా….? అయితే మీలాంటి వారి కోసం ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త కొత్త ప్యాకేజీలను తీసుకువస్తోంది. ఇందులో భాగంగా షిర్డీకి తాజాగా టూర్ ప్యాకేజీ ప్రకటించింది. (Image Source @SSSTShirdi 'X')

విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని డిసెంబర్ 10, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

(2 / 7)

విజయవాడ నుంచి షిర్డీ వెళ్లేందుకు టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీని డిసెంబర్ 10, 2024వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. https://www.irctctourism.com/p వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.(Image Source @SSSTShirdi 'X')

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ఇది మొత్తం  4 రోజుల టూర్ ప్యాకేజీ.  ట్రైన్ జర్నీ  ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. కేవలం విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.

(3 / 7)

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో ఈ ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. ఇది మొత్తం  4 రోజుల టూర్ ప్యాకేజీ.  ట్రైన్ జర్నీ  ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. కేవలం విజయవాడలోనే కాకుండా.. ఖమ్మం, సికింద్రాబాద్, విజయవాడ, వరంగల్ రైల్వే స్టేషన్లల్లో కూడా రైలు ఎక్కే అవకాశం ఉంటుంది.(Image Source @SSSTShirdi 'X')

టూర్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. సెకండ్ డే ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

(4 / 7)

టూర్ షెడ్యూల్ చూస్తే ఫస్ట్ డే విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా ప్రయాణం ఉంటుంది. సెకండ్ డే ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.(Image Source @SSSTShirdi 'X')

3వ రోజు మార్నింగ్ శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

3వ రోజు మార్నింగ్ శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున మూడు గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.(Image Source @SSSTShirdi 'X')

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 17,150గా నిర్ణయించారు.  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,850చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.  స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6510గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 14810గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 8260గా ఉంది. 

(6 / 7)

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 17,150గా నిర్ణయించారు.  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,600, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,850చెల్లించాలి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి.  స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6510గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 14810గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 8260గా ఉంది. (Image Source @SSSTShirdi 'X')

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076 

(7 / 7)

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR076 (Image Source @SSSTShirdi 'X')

WhatsApp channel

ఇతర గ్యాలరీలు