(1 / 7)
వేసవి రావటంతో టూరిస్టులు అధ్యాత్మిక ప్రాంతాలతో టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే… ఐఆర్సీటీసీ టూరిజం సరికొత్త టూర్ ప్యాకేజీని తీసుకువస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించుకోవచ్చు.
(unsplash.com)(2 / 7)
“TIRUPATI BY VENKATADRI EXPRESS” పేరుతో ఐఆర్సీటీసీ టూరిజం ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తుంది. హైదరాబాద్ ఆపరేట్ చేసే ఈ ట్రిప్… నాలుగు రోజులు ఉంటుంది. ముందుస్తుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ట్రిప్ మార్చి 29వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను IRCTC అధికారిక వెబ్ సైట్ లో చూడొచ్చు.
(unsplash.com)(3 / 7)
టూర్ షెడ్యూల్ చూస్తే…. కాచిగూడ స్టేషన్ నుంచి రాత్రి 8.5 గంటల ట్రైన్(ట్రైన్ నెంబర్ 12797) బయల్దేరుతుంది. రాత్రంతా జర్నీ ఉంటుంది. ఉదయం 07.05 గంటలకు తిరుపతికి చేరుకుంటారు. హోటల్ కి చెకిన్ అయిన తర్వాత…. ఫ్రెషప్ అవుతారు. తిరుచానూరు పద్మావతి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్తారు. ఆ తర్వాత హోటల్ కి చేరుకుంటారు. రాత్రి తిరుపతిలోనే ఉంటారు.
(unsplash.com)(4 / 7)
మూడో రోజు తెల్లవారుజామున హోటల్ నుంచి బయల్దేరుతారు. తిరుమలకు చేరుకుంటారు. ఉచితంగా దర్శనం ఉంటుంది. ఆ తర్వాత హోటల్ వద్ద డ్రాప్ చేస్తారు.
(unsplash.com)(5 / 7)
సాయంత్రం 06.35 గంటల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి రైలు (12798నెంబర్ ) బయల్దేరుతుంది. ఉదయం 06.20 గంటలకు కాచిగూడకు చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(unsplash.com)(6 / 7)
టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ లో రూ. 13810. డబుల్ షేరింగ్ కు రూ. 10720, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 8940గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 12030, డబుల్ షేరింగ్ కు రూ. 8940, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 7170 గా ఉంది. చిన్న పిల్లలకు వేర్వురు ధరలు ఉన్నాయి.
(unsplash.com)(7 / 7)
ఈ లింక్ పై క్లిక్ చేసి టూర్ ప్యాకేజీ వివరాలతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు. ఏమైనా సందేహాలు ఉంటే 9701360701 / 9281030712 నెంబర్లను సంప్రదించవచ్చు.
ఇతర గ్యాలరీలు