IRCTC Srisailam Tour 2025 : శివరాత్రి వేళ 'శ్రీశైలం' ట్రిప్ - యాదాద్రి కూడా చూడొచ్చు, కొత్త టూర్ ప్యాకేజీ ఇదే-irctc tourism to operate srisailam tour on 24th february from hyderabad ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Srisailam Tour 2025 : శివరాత్రి వేళ 'శ్రీశైలం' ట్రిప్ - యాదాద్రి కూడా చూడొచ్చు, కొత్త టూర్ ప్యాకేజీ ఇదే

IRCTC Srisailam Tour 2025 : శివరాత్రి వేళ 'శ్రీశైలం' ట్రిప్ - యాదాద్రి కూడా చూడొచ్చు, కొత్త టూర్ ప్యాకేజీ ఇదే

Published Feb 19, 2025 06:09 PM IST Maheshwaram Mahendra Chary
Published Feb 19, 2025 06:09 PM IST

  • IRCTC Hyderabad Srisailam Tour Package 2025 : ఈ మహాశివరాత్రి వేళ శ్రీశైలం వెళ్లాలని అనుకునేవారి కోసం IRCTC టూరిజం కొత్త ప్యాకేజీ తీసుకువచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా యాదాద్రికి కూడా చూసి రావొచ్చు. ఈ ట్రిప్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి….

శివరాత్రి వేళ శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇందుకోసం అనేక రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఈ శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ IRCTC టూరిజం శుభవార్త చెప్పింది. 

(1 / 7)

 బడ్జెట్ ధరలోనే శ్రీశైలం వెెళ్లేందుకు టూరిజం ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీలో భాగంగానే యాదాద్రి కూడా చూసి రావొచ్చు. హైదరాబాద్ నుంచి ''SPIRITUAL TELANGANA WITH SRISAILAM' పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది..

(2 / 7)

ఈ కొత్త టూర్ ప్యాకేజీలో భాగంగా…' శ్రీశైలం మల్లికార్డునుడిని దర్శించుకుంటారు. అంతేకాకుండా…. హైదరాబాద్ లోని గొల్కోండ ఫోర్ట్, సలార్ జంగ్ మ్యూజియం, బిర్లామందిర్ ను సందర్శించారు. ఫైనల్ గా యాదాద్రి నర్సింహ్మా స్వామిని దర్శించుకోవటంతో టూర్ ముగుస్తుంది. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 24 ఫిబ్రవరి 2025వ తేదీన అందుబాటులో ఉంది. 

(3 / 7)

ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ లో పిక్ అప్ చేసుకుంటారు. హైదరాబాద్ లోని పలు సందర్శన ప్రాంతాలను చూపిస్తారు. ఇందులో చార్మినార్, సలార్ జంగ్ మ్యూజియం, లుంబినీ పార్క్ ఉంటాయి. ఆ తర్వాత హోటల్ కు వెళ్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు. రెండో రోజు ఉదయం 5 గంటలకు శ్రీశైలం వెళ్తారు. మల్లిఖార్డున స్వామి దర్శనం ఉంటుంది. సాయంత్రం వరకు హైదరాబాద్ తిరిగి చేరుకుంటారు.

(4 / 7)

3వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత,,, బిర్లా మందిర్ వెళ్తారు. ఆ తర్వాత గొల్కోండ ఖిల్లాను చూస్తారు. మధ్యాహ్నం అంబేడ్కర్ విగ్రహం చూస్తారు. రాత్రి హైదరాబాద్ లోనే బస చేస్తారు. 4వ రోజు ఉదయం యాదగిరిగుట్టకు వెళ్తారు. సురేంద్రపురిని కూడా సందర్శిస్తారు. సాయంత్రం హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 7)

హైదరాబాద్ - శ్రీశైలం ట్రిప్ ధరలు : సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 37200 ఉంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.  19530, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి  రూ. 14880గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. గ్రూప్ సైజ్ ఒకటి నుంచి మూడుగా ఉంటుంది. 

(6 / 7)

 ఈ టూరిజం ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలంటే…IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లాలి. పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. ఈ ప్యాకేజీలో భోజన వసతితో పాటు మరికొన్ని సదుపాయాలు ఉంటాయి. ఏమైనా సందేహాలు ఉంటే 8287932229 / 8287932228 నెంబర్లను సంప్రదించవచ్చు.

(7 / 7)

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
WhatsApp channel

ఇతర గ్యాలరీలు