IRCTC Shirdi Tour Package : విజయవాడ నుంచి షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి-irctc tourism to operate shirdi trip from vijayawada in this march month 2025 details here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Irctc Shirdi Tour Package : విజయవాడ నుంచి షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

IRCTC Shirdi Tour Package : విజయవాడ నుంచి షిర్డీ, శనిశిగ్నాపూర్ ట్రిప్ - ఈ టూర్ ప్యాకేజీ చూడండి

Published Mar 15, 2025 10:17 AM IST Maheshwaram Mahendra Chary
Published Mar 15, 2025 10:17 AM IST

  • IRCTC Vijayawada Shirdi Tour Package 2025 :విజయవాడ నుంచి షిర్డీ టూర్ ప్యాకేజీ వచ్చేసింది. ఈనెలలోనే జర్నీ ఉంటుంది.  ఈ మేరకు IRCTC టూరిజం వివరాలను పేర్కొంది. ఈ ట్రిప్ లో భాగంగా షిర్డీతో పాటు శనిశిగ్నాపూర్ కూడా చూసి రావొచ్చు. ఈ ప్యాకేజీ ధరలు, షెడ్యూల్ వివరాలను ఇక్కడ చూడండి….

ఈ మార్చి నెలలో షిర్డీ సాయి బాబాను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకోసం IRCTC టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. విజయవాడ నుంచి ఈ ట్రిప్  అందుబాటులో ఉంటుంది. 

(1 / 8)

(photo source @tstdcofficial twitter)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 25 మార్చి, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో తేదీలో కూడా బుకింగ్ చేసుకుని వెళ్లొచ్చు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి బుకింగ్ తో పాటు పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

(2 / 8)

(image source @SSSTShirdi X Account)

ఐఆర్ సీటీసీ టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే “SAI SANNIDHI EX VIJAYAWADA” పేరుతో ఈ ప్యాకేజీ కనిపిస్తుంది. మొత్తం  4 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.  ట్రైన్ జర్నీ  ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. విజయవాడ మాత్రమే కాకుండా…  ఖమ్మం, వరంగల్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక్కవచ్చు. 

(3 / 8)

(image from @SSSTShirdi 'X' Account)

 విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి జర్నీ స్టార్ట్ అవుతుంది. రాత్రి 10.15 గంటలకు షిర్డీ ఎక్స్‌ప్రెస్ రైలు(17208- Sainagar Shirdi Express) ఎక్కాలి. రాత్రంతా జర్నీ చేస్తారు. రెండో రోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్ చేరుకుంటారు. ఆ తర్వాత షిర్డీకి వెళ్తారు. ఆలయ సందర్శన ఉంటుంది. సాయంత్రం షాపింగ్ కోసం ఫ్రీ టైమ్ ఉంటుంది. రాత్రి షిర్డీలోనే బస చేస్తారు.

(4 / 8)

మూడో  రోజు ఉదయం శనిశిగ్నాపూర్ కు వెళ్తారు. ఇక్కడ దర్శనం పూర్తి చేసుకుంటారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్టీ చేరుకుంటారు. రాత్రి 7.29 గంటలకు నాగర్‌సోల్ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తెల్లవారుజామున 3 గంటలకు విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకోవడంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(5 / 8)

(Image Source From @SSSTShirdi 'X')

విజయవాడ - షిర్డీ టూర్ ప్యాకేజీ ధరలు : కంఫర్ట్ క్లాస్ (3ఏసీ)లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 16,150గా నిర్ణయించారు.  డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,100, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 8,520 చెల్లించాలి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు 6180గా ధర ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 7760, డబుల్ షేరింగ్ కు రూ. 7760గా ఉంది.  

(6 / 8)

(Image Source @SSSTShirdi 'X')

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. 

(7 / 8)

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు. 

(image source @SSSTShirdi X Account)

ఈ లింక్ పై క్లిక్ చేసి విజయవాడ -షిర్డీ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

(8 / 8)

లింక్ పై క్లిక్ చేసి విజయవాడ -షిర్డీ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు. 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు