(1 / 9)
వేసవి సెలవులొచ్చాయి.. దీంతో చాలా మంది టూర్లకు వెళ్తున్నారు. అయితే మహారాష్ట్రలోని షిర్డీకి వెళ్లేందుకు ఐఆర్ సీటీసీ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ మే నెలలోనే జర్నీ ఉంది.
(photo source @tstdcofficial twitter)(2 / 9)
2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ ప్యాకేజీలో షిర్డీ సాయిబాబా దర్శనం ఉంటుంది. ప్రతి బుధవారం ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉండేలా ఐఆర్‌సీటీసీ టూరిజం ప్లాన్ చేసింది.
(image from @SSSTShirdi 'X' Account)(3 / 9)
హైదరాబాద్ నుంచి ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ప్రస్తుతం ఈ ట్రిప్ మే 14, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే… మరో డేట్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఈ వివరాలను టూరిజం వెబ్ సైట్ లో తెలుసుకోవాల్సి ఉంటుంది.
(image from @SSSTShirdi 'X' Account)(4 / 9)
IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్తే ‘SAI SANNIDHI EX HYDERABAD’ పేరుతో ప్యాకేజీ డిస్ ప్లే అవుతుంది. పూర్తి వివరాలను తెలుసుకోవటంతో పాటు ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
(image source @SSSTShirdi X Account)(5 / 9)
ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా… మొదటి రోజు కాచిగూడ రైల్వే స్టేషన్లో జర్నీ ప్రారంభమవుతుంది. సాయంత్రం 06.40 గంటలకు రైలు(ట్రైన్ నెంబర్ - 17064) ఉంటుంది. రాత్రి మొత్తం ప్రయాణం చేయాలి.
(image from @SSSTShirdi 'X' Account)(6 / 9)
రెండో రోజు ఉదయం 07.10 గంటలకు నాగర్‌సోల్ వెళ్తుంది. ఆ తర్వాత షిరిడీకి వెళ్లాలి. హోటల్ వెళ్లిన తర్వాత.. షిరిడీ ఆలయ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. సాయంత్రం 05 గంటలకు రూమ్ చెకౌట్ చేయాలి. రాత్రి 08. 30 గంటల వరకు నాగర్ సోల్ రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. మూడో రోజు ఉదయం 09:45 గంటలకు కాచిగూడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
(Image Source @SSSTShirdi 'X')(7 / 9)
హైదరాబాద్ - షిర్టీ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.7890గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 6660,ట్రిపుల్ షేరింగ్ కు రూ. 6640గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు అందుబాటులో ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 4960, డబుల్ షేరింగ్ కు రూ. 4980, సింగిల్ షేరింగ్ కు రూ. 6220గా నిర్ణయించారు.
(image from @SSSTShirdi 'X' Account)(8 / 9)
ఈ ప్యాకేజీలో టూర్ టికెట్లు, లంచ్, డిన్నర్, టూర్ గైడ్ అందుబాటులో ఉంటాయి. ఏదైనా వ్యక్తిగత ఖర్చులు ఉంటే మీరు భరించుకోవాలి. ఏమైనా సందేహాలు ఉంటే 040-27702407, 9701360701 నెంబర్లను సంప్రదించవచ్చు.
(9 / 9)
ఈ లింక్ పై క్లిక్ చేసి హైదరాబాద్ - షిర్డీ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
(image source @SSSTShirdi X Account)ఇతర గ్యాలరీలు