హైదరాబాద్ టు ఊటీ - ఈనెలలోనే ట్రిప్, IRCTC టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism to operate ooty tour package from hyderabd in this month 2025 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్ టు ఊటీ - ఈనెలలోనే ట్రిప్, Irctc టూర్ ప్యాకేజీ వివరాలివే

హైదరాబాద్ టు ఊటీ - ఈనెలలోనే ట్రిప్, IRCTC టూర్ ప్యాకేజీ వివరాలివే

Updated Oct 07, 2025 01:31 PM IST Maheshwaram Mahendra Chary
Updated Oct 07, 2025 01:31 PM IST

ఈనెలలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం IRCTC టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీలో మంచి అద్భుతమైన టూరిస్ట్ ప్లేసులను చూసి రావొచ్చు. వివరాలను ఇక్కడ తెలుసుకోండి…

ఐఆర్‌సీటీసీ టూరిజం అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంటి రైలు ద్వారా ఈ ప్రయాణం చేయవచ్చు.

(1 / 7)

ఐఆర్‌సీటీసీ టూరిజం అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ పేరుతో టూర్ ప్యాకేజీని అందిస్తుంది. ప్రతీ మంగళవారం ఈ టూర్ ఉంటుంది. హైదరాబాద్ నుంటి రైలు ద్వారా ఈ ప్రయాణం చేయవచ్చు.

అయితే ఇతర స్టేషన్ల నుంచి కూడా మీరు రైలు ఎక్కొచ్చు. గుంటూరు జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ఈ టూర్ ప్యాకేజీ ఉంది. టూర్ ముగిశాక మీరు ఆయా స్టేషన్లలో దిగుతారు.

(2 / 7)

అయితే ఇతర స్టేషన్ల నుంచి కూడా మీరు రైలు ఎక్కొచ్చు. గుంటూరు జంక్షన్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ నుంచి కూడా ఈ టూర్ ప్యాకేజీ ఉంది. టూర్ ముగిశాక మీరు ఆయా స్టేషన్లలో దిగుతారు.

(photo source from unsplash.com/)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 14-OCT-25 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో ఈ వివరాలను చూడొచ్చు.

(3 / 7)

ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 14-OCT-25 తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. https://www.irctctourism.com/ వెబ్ సైట్ లో ఈ వివరాలను చూడొచ్చు.

(photo source @GMSRailway twitter)

5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.25 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.20629) ఉంటుంది. నైట్ అంతా జర్నీలో ఉంటారు.

(4 / 7)

(www.irctctourism.com)

2వరోజు మార్నింగ్ 7:57కి కోయంబత్తూరు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఊటీకి వెళ్లాలి. హోటల్‌లో చెక్ ఇన్ అవుతారు. మధ్యాహ్నం బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ అందాలను విజిట్ చేస్తారు. రాత్రి హోటల్‌లో బస చేస్తారు.మూడో రోజు మార్నింగ్ లేచి బ్రేక్ ఫాస్ట్ తర్వాత దొడబెట్ట పీక్‌కు వెళ్తారు. టీ మ్యూజీయం, పైకారా వాటర్ ఫాల్స్ చూస్తారు. ఊటీలోనే నైట్ స్టే ఉంటుంది.

(5 / 7)

4వ రోజు ఉదయం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ చేసి.. కూనూరుకు వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి ఊటీకి వస్తారు. నైట్ ఇక్కడే ఉంటారు. ఐదో రోజు టిఫిన్ చేసి ఊటీ నుంచి కోయంబత్తూరు వెళ్తారు. సాయంత్రం 3:40 గంటలకు శబరి ఎక్స్ ప్రెస్ ఉంటుంది. రాత్రి జర్నీ చేస్తారు. ఆరో రోజు 11 గంటలకు గంటలకు సికింద్రాబాద్ వస్తారు. దీనితో టూర్ ముగుస్తుంది.

(6 / 7)

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 34460గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19300, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17340గా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14790గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16750, సింగిల్ షేరింగ్ కు రూ. 31910గా నిర్ణయించారు.  5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

(7 / 7)

హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 34460గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 19300, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 17340గా నిర్ణయించారు.

స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 14790గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 16750, సింగిల్ షేరింగ్ కు రూ. 31910గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.

(unsplash.com)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు