IRCTC Ooty Tour 2025 : హైదరాబాద్ టు ఊటీ - బడ్జెట్ ధరలోనే 6 రోజుల ట్రిప్, తాజా ప్యాకేజీ వివరాలివే
- IRCTC Hyderabad Ooty Tour Package: ఈ జనవరి నెలలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం IRCTC టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ప్రకటించింది. జనవరి 28వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది. తక్కువ ధరతోనే ఊటీతో పాటు కున్నూర్ చూసి రావొచ్చు.
- IRCTC Hyderabad Ooty Tour Package: ఈ జనవరి నెలలో ఊటీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా..? మీ కోసం IRCTC టూరిజం హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ప్రకటించింది. జనవరి 28వ తేదీన ట్రిప్ అందుబాటులో ఉంది. తక్కువ ధరతోనే ఊటీతో పాటు కున్నూర్ చూసి రావొచ్చు.
(1 / 7)
తక్కువ ధరలోనే ఊటీ ప్యాకేజీ చూస్తున్నారా…? అయితే మీకోసం ఐఆర్ సీటీసీ టూరిజం కొత్త ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది.
(2 / 7)
‘ULTIMATE OOTY EX HYDERABAD ’పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఇందులో భాగంగా... ఊటీతో పాటు కున్నూర్ వంటి టూరిజం ప్రాంతాలను చూసి రావొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ జనవరి 28, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
(3 / 7)
5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. హైదరాబాద్ నుంచి రైలు జర్నీ ఉంటుంది. ఊటీ టూర్ ప్యాకేజీలో భాగంగా తొలి రోజు హైదరాబాద్‌లో జర్నీ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు(Train No.17230) ఉంటుంది. నైట్ అంతా జర్నీలో ఉంటారు.
(4 / 7)
రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్ కు వెళ్తారు. అక్కడ నుంచి ఊటీకి చేరుకుంటారు. హోటల్‌లోకి చెకిన్ అవ్వాలి. తర్వాత బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్ ను చూపిస్తారు. రాత్రి భోజనం చేసి ఊటీలో బస చేయాలి. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ చూసేందుకు వెళ్తారు. రాత్రికి ఊటీలో బస చేయాలి. నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ కు తీసుకెళ్తారు. రాత్రికి ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది
(5 / 7)
5వ రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్తారు. మధ్యాహ్నం 03.55 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్(Train No. 17229) ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. ఆరో రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ ముగుస్తుంది.
(www.irctctourism.com)(6 / 7)
హైదరాబాద్ - ఊటీ ట్రిప్ ధరలు: కంఫర్డ్ క్లాస్(3A) లో సింగిల్ షేరింగ్ కు రూ. 29800గా ఉంది. డబుల్ షేరింగ్ కు రూ. 16870, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 15530గా నిర్ణయించారు.
స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ. 13070గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్ కు రూ. 14410, సింగిల్ షేరింగ్ కు రూ. 27340గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు వేర్వురు ధరలు ఉంటాయి. ఇక టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి.
(unsplash.com)(7 / 7)
హైదరాబాద్ - ఊటీ టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR094
(image source @TravelWorld_)ఇతర గ్యాలరీలు