IRCTC Goa Tour Package 2025 : హైదరాబాద్ టు గోవా - కొత్త టూర్ ప్యాకేజీ వచ్చేసింది..! ఓ లుక్కేయండి
- IRCTC Hyderabad Goa Tour Package: టూరిస్టులకు IRCTC టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మర్ ఎంట్రీ ఇచ్చిన వేళ.. గోవాకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. మార్చి 20వ తేదీన జర్నీ ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త ప్యాకేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
- IRCTC Hyderabad Goa Tour Package: టూరిస్టులకు IRCTC టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. సమ్మర్ ఎంట్రీ ఇచ్చిన వేళ.. గోవాకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది. మార్చి 20వ తేదీన జర్నీ ఉంటుందని ప్రకటించింది. ఈ కొత్త ప్యాకేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి….
(1 / 7)
ఎండలు అప్పుడే మొదలయ్యాయి. ఫిబ్రవరి మాసంలోనే వేసవిని తలపించేలా భానుడి భగభగలు ఉంటున్నాయి. అయితే సమ్మర్ వస్తుందంటే చాలు… చాలా మంది గోవా ట్రిప్ ప్లాన్ చేస్తుంటారు. అయితే అలాంటి టూరిస్టులకు ఐఆర్ సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది.
(2 / 7)
గోవా వెళ్లే వారికోసం ఐఆర్‌సీటీసీ టూరిజం 'GOAN DELIGHT' పేరుతో ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రస్తుతం మార్చి 20, 2025వ తేదీన అందుబాటులో ఉంది.
(image source istockphoto.com)(3 / 7)
3 రాత్రులు 4 రోజుల టూర్ ప్యాకేజీ. ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. తొలిరోజు హైదరాబాద్ నుంచి ఉదయం 11.20 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి బయల్దేరుతారు. 12.30 గంటలకు గోవాకు చేరుకుంటారు. అక్కడ్నుంచి హోటల్ లోకి చెకిన్ అవుతారు. Zuari నది అందాలను అస్వాదిస్తారు. 2వరోజు సౌత్ గోవాలో పర్యటిస్తారు. ఓల్డ్ గోవా చర్చిని సందర్శిస్తారు. ఇదే ప్రాంతంలో పురాతన మ్యూజియం ఉంటుంది. , wax world Museum, మంగేషి ఆలయం, Miramar Beachకు వెళ్తారు. మండోవి నదిలో బోట్ క్రూజ్ జర్నీ ఉంటుంది
(image source istockphoto.com)(4 / 7)
మూడో రోజు నార్త్ గోవా వెళ్తారు. Aguada ఫోర్టు, కండోలియం బీచ్, బాగా బీచ్ లో స్పోర్ట్ ఈవెంట్స్ లో పాల్గొంటారు. అంజునా బీచ్, వగాటర్ బీట్, చాపోరా బీచ్ సందర్శన తర్వాత తిరిగి హోటల్ కి వెళ్తారు. 4వ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అవుతారు. మధ్యాహ్నం 02. 25 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి రిటర్న్ జర్నీ ఉంటుంది. మధ్యాహ్నం 03. 40 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటారు. దీంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
(image source istockphoto.com)(5 / 7)
హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ అక్యుపెన్సీకి రూ. 24485గా నిర్ణయించారు. డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 20000, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 19625గా ఉంది. కంఫర్ట్ క్లాస్ లో ఈ ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ వివరాలను తెలుసుకోవచ్చు.
(image source istockphoto.com)(6 / 7)
ఈ ప్యాకేజీకి సంబంధించి జోనల్ ఆఫీస్( 040-27702407 / 9701360701) నెంబర్లను సంప్రదించవచ్చు.
(image source istockphoto.com)(7 / 7)
ఈ లింక్ పై క్లిక్ చేసి హైదరాబాద్ - గోవా టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.
(image source istockphoto.com)ఇతర గ్యాలరీలు