IRCTC kumbha Mela Tour Package : హైదరాబాద్ టు మహాకుంభమేళా - ఈనెలలోనే ట్రిప్, ఈ టూర్ ప్యాకేజీ చూడండి
- Mahakumbha Mela Tour Package 2025 : మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ఐఆర్ సీటీసీ టూరిజం అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 6 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
- Mahakumbha Mela Tour Package 2025 : మహాకుంభమేళాకు వెళ్లే ప్రయాణికులకు ఐఆర్ సీటీసీ టూరిజం అప్డేట్ ఇచ్చింది. హైదరాబాద్ నుంచి ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం 6 రోజులు ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి…
(1 / 7)
ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాకు దేశవ్యాప్తంగా తరలివెళ్తున్నారు.అయితే హైదరాబాద్ నుంచి వెళ్లేందుకు IRCTC టూరిజం స్పెషల్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ట్రైన్ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేయనుంది.
(2 / 7)
"MAHA KUMBH YATRA (SHR048A)" పేరుతో ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాలి. ప్రస్తుతం ఈ ప్యాకేజీ ఫిబ్రవరి 14వ తేదీన అందుబాటులో ఉంది.
(3 / 7)
మొదటి రోజు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 09.25 కు బయల్దేరాలి.రాత్రి అంతా జర్నీలో ఉంటారు. రెండో రోజు 01. 30 గంటలకు వారణాసికి చేరుకుంటారు. హోటల్ లోకి చెకిన్ అవుతారు. సాయంత్రం గంగా హారతి కార్యక్రమానికి హాజరువుతారు. రాత్రి వారణాసిలోనే ఉంటారు.
(4 / 7)
మూడో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత వారణిసిలోని స్థానిక ఆలయాలను చూస్తారు. ఆ తర్వాత షాపింగ్ చేస్తారు. డిన్నర్ తర్వాత వారణాసిలో బస చేస్తారు. నాల్గో రోజు ప్రయాగ్ రాజ్ కు వెళ్తారు. అక్కడ్నుంచి టెంట్ సిటీకి చేరుతారు.
(5 / 7)
5వ రోజు త్రివేణి సంగమానికి చేరుకుంటారు. మహాకుంభమేళలో పవిత్ర స్నానాలు చేస్తారు. ఆ తర్వాత ప్రయాగ్ రాజ్ కు చేరుకుంటారు. రాత్రి 07.45 గంటలకు సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ లో రిటర్న్ జర్నీ స్టార్ట్ అవుతుంది. ఆరో రోజు రాత్రి 09. 30 గంటకు సికింద్రాబాద్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.
(PTI)(6 / 7)
హైదరాబాద్ - కుంభమేళా టూర్ ప్యాకేజీ ధరలు: కంఫర్ట్ క్లాస్ లో సింగిల్ షేరింగ్ కు రూ. 48730, డబుల్ షేరింగ్ కు రూ. 31610, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 29390 ధరగా నిర్ణయించారు. స్టాండర్డ్ క్లాస్ లో చూస్తే ట్రిపుల్ షేరింగ్ కు రూ. 26360గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు వేర్వురు ధరలను నిర్ణయంచారు.
(7 / 7)
హైదరాబాద్ - కుంభమేళా టూర్ ప్యాకేజీ బుకింగ్ లింక్ : https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR048A
(PTI)ఇతర గ్యాలరీలు