హైదరాబాద్ టు కేరళ - జూలై నెలలో జర్నీ..! ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే-irctc tourism to operate kerala tour package from hyderabad on july 1 ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  హైదరాబాద్ టు కేరళ - జూలై నెలలో జర్నీ..! ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

హైదరాబాద్ టు కేరళ - జూలై నెలలో జర్నీ..! ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

Published Jun 22, 2025 03:24 PM IST Maheshwaram Mahendra Chary
Published Jun 22, 2025 03:24 PM IST

కేరళ ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా..? అయితే IRCTC టూరిజం… హైదరాబాద్ నుంచి ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. జూలై మొదటి వారంలో జర్నీ ఉంటుంది. షెడ్యూల్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి….

కేరళలోని ప్రకృతి అందాలను చూసేందుకు ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేయనుంది.

(1 / 8)

ఈ ట్రిప్ లో భాగంగా అలెప్పీ, మున్నార్ తో పాటు మరికొన్ని టూరిస్ట్ స్పాట్లు చూస్తారు. ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ 1 జూలై, 2025వ తేదీన అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఆపరేట్ చేస్తారు.

(2 / 8)

ఐఆర్సీటీసీ టూరిజం. 'KERALA HILLS & WATERS ' పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. IRCTC టూరిజం వెబ్ సైట్ లోకి వెళ్లి ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి ట్రైన్ లో వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుత తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవచ్చు.

(3 / 8)

మొదటి రోజు హైదరాబాద్ లోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్(ట్రైన్ నెంబర్-.17230, శబరి ఎక్స్ ప్రెస్) నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు జర్నీ మొదలవుతుంది. రాత్రంతా ప్రయాణం చేస్తారు. రెండో రోజు మధ్యాహ్నం 12.55 నిమిషాలకు ఎర్నాకులం రైల్వే స్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం మున్నార్ టౌన్ లో పర్యటిస్తారు. రాత్రి మున్నార్ లోనే ఉంటారు.

(4 / 8)

3వ రోజు ఉదయం ఎరవీకులం నేషన్ ప్రాక్ ను చూస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్ తో పాటు ఏకో పాయింట్ ను చూస్తారు. రాత్రి కూడా మున్నార్ లోనే ఉంటారు.నాల్గో రోజు హోటల్ నుంచి బయల్దేరి…. అలెప్పీకి వెళ్తారు. హోటల్ లోకి చెకిన్ అయిన తర్వాత... బ్యాక్ వాటర్ ప్రాంతానికి వెళ్తారు. రాత్రి అలెప్పీలో బస చేస్తారు.

(5 / 8)

ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. 6వ రోజు మధ్యాహ్నం 12:20 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

(6 / 8)

హైదరాబాద్ - కేరళ టూర్ ప్యాకేజీ ధరలు : సింగిల్ షేరింగ్ కు రూ.32310, డబుల్ షేరింగ్ కు రూ.18870 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు రూ. 16330గా నిర్ణయించారు. ఈ ధరలు కంఫార్ట్ క్లాస్(3A) లో ఉంటాయి. స్టాండర్డ్ క్లాస్ లో ట్రిపుల్ షేరింగ్ కు రూ.13600గా ఉంది. సింగిల్ షేరింగ్ కు రూ. 29580, డబుల్ షేరింగ్ కు రూ. 16140గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారుకు కూడా టికెట్ ధరలు నిర్ణయించారు.

(7 / 8)

ఈ టూర్ కి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే.. 8287932229 / 9701360701 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. https://www.irctctourism.com/pacakage_description?packageCode=SHR092 లింక్ పై క్లిక్ చేసి ఈ టూర్ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవచ్చు.

(8 / 8)

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు